RGV: కల్కి ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్…

RGV: కల్కి ట్రైలర్ ను చూసిన ఆర్జీవీ ట్రైలర్ మీద తన స్పందనను తెలియజేశాడు. "యంగ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ దీనిని చాలా అద్భుతంగా తీశాడు.

Written By: Gopi, Updated On : June 22, 2024 3:10 pm

Ram Gopal Varma comments on Kalki trailer

Follow us on

RGV: ఇక కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ నుంచి విపరీతమైన ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి రోజుకొక అప్డేట్ అయితే వస్తుంది. ఇక దాంతో సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ ను చూసిన ఆర్జీవీ ట్రైలర్ మీద తన స్పందనను తెలియజేశాడు. “యంగ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ దీనిని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా కూడా చాలా బాగుండే విధంగా కనిపిస్తుంది”. అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూనే తన ట్విట్టర్ వేదికగా ఈ ట్రైలర్ ని షేర్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఆర్జీవీ చేసిన పోస్ట్ ను చూసిన చాలా మంది అభిమానులు కల్కి సినిమా ప్రమోషన్స్ ని ఆ సినిమా యూనిట్ ఆర్జీవీ కి అప్పజెప్పినట్టు ఉంది. అందుకే ఆయన ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు.

Also Read: Krack Movie: క్రాక్ సినిమాలో వరలక్ష్మి పాత్రకి ముందుగా ఆ స్టార్ నటిని తీసుకోవాలనుకున్నారా..?

ఇక ఆర్జీవీ సినిమా మీద చేసిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..మొత్తానికైతే ఈ సినిమాను మరొక భారీ సక్సెస్ గా మార్చడానికి సినిమా యూనిట్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది. మరి కెరీర్ లో ఇప్పటివరకు బాహుబలి 2 సినిమా బిగ్గెస్ట్ హిట్ నిలిచింది.

Also Read: Kalki Movie: కల్కి సినిమాకి సెన్సార్ కట్ చేసిన సీన్స్ వల్ల ఎంత నష్టం జరగబోతుందో తెలుసా..?

మరి ఆ రికార్డును బ్రేక్ చేసి ఈ సినిమా దాని పక్కన నిలుస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే మరొకసారి ప్రభాస్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…