https://oktelugu.com/

Kalaratri OTT: ఆ ఫార్మ్ హౌస్ లో ఏం జరుగుతుంది… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ ఓటీటీలో! ఎక్కడ చూడొచ్చు?

ప్రముఖ ఓటీటీ యాప్ లో అదిరిపోయే థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. సస్పెన్సు థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ విజువల్ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా మారే ఆ చిత్రం ఏమిటి? ఎక్కడ చుడొచ్చో? తెలుసుకుందాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 17, 2024 / 11:24 AM IST

    Kalaratri OTT

    Follow us on

    Kalaratri OTT: వీకెండ్ వచ్చిందంటే సినిమా ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్స్ లో మూడు బడా చిత్రాలు విడుదలయ్యాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలైంది. మిస్టర్ బచ్చన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అక్కడక్కడా ఓహో అనిపించే కొన్ని సన్నివేశాలు తప్పితే ఆద్యంతం అలరించే చిత్రం కాదని అంటున్నారు. ఇక రామ్ పోతినేని-పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన రెండవ చిత్రం డబుల్ ఇస్మార్ట్. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్. డబుల్ ఇస్మార్ట్ సైతం ఆగస్టు 15న విడుదల చేశారు.

    డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ రిపీట్ కాలేదు. చూసిన సినిమా మరలా చూసినట్లు ఉందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో సంజయ్ దత్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. పా రంజిత్ తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం తంగలాన్. విక్రమ్ హీరోగా నటించారు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ చిత్రాల కంటే మెరుగైన టాక్ తంగలాన్ తెచ్చుకుంది.

    మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒక చిత్రాన్ని అసలు మిస్ కావద్దు. సస్పెన్సు థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్. ఆ చిత్రం ఏమిటంటే.. కాళరాత్రి. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కాళరాత్రి ఆగస్టు 17 నుండి స్ట్రీమ్ అవుతుంది. కాళరాత్రి ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి.

    కాళరాత్రి చిత్రంలో బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి ప్రధాన పాత్రలు చేశారు. బాలు చరణ్ కాళరాత్రి చిత్రాన్ని నిర్మించాడు. మర్ఫీ దేవసి కాళరాత్రి చిత్రానికి దర్శకుడు. కాళరాత్రి చిత్ర కథ విషయానికి వస్తే… ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఈ బిజినెస్ లో ఎదగాలని కొందరు మిత్రులు ప్లాన్ చేస్తారు.

    ఈ క్రమంలో 266 ఎకరాల ఎస్టేట్ తక్కువ ధరకు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుంటారు. ఆ ఎస్టేట్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ కావాలని కోరుకుంటారు. పార్ట్నర్స్ అందరూ కర్ణాటకలో ఉన్న ఆ 266 ఎకరాల ఎస్టేట్ కి వెళతారు. ఆ ఎస్టేట్ మధ్యలో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది. ఆ ఇంట్లో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి.

    ఆ ఇంట్లో కొన్ని మరణాలు సంభవిస్తాయి. ఈ మరణాల వెనకున్నది ఎవరో వాళ్లకు అర్థం కాదు. వాళ్లలో వాళ్లు అనుమాన పడతారు. ఆ 266 ఎకరాల ఎస్టేట్ లో చోటు చేసుకునే పరిస్థితులు వాళ్లకు కునుకు లేకుండా చేస్తాయి. అసలు ఈ మరణాల వెనకుంది ఎవరు? ఎవరు వారిని టార్గెట్ చేశారు?కారణం ఏమిటీ? ఆ ఎస్టేట్ నుండి పార్టనర్స్ ఎలా బయటపడ్డారు? అనేది కాళరాత్రి మూవీలోని మిగతా కథ.

    కాళరాత్రి కథ పాతదే అయినా సస్పెన్సు రేపే అంశాలతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కథనం ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్స్ ప్రధాన హైలైట్స్. సస్పెన్సు థ్రిల్లర్స్ ఇష్టపడేవారు కాళరాత్రి సినిమా తప్పక చూడాల్సిందే.