https://oktelugu.com/

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి రష్మీ భారీ షాక్.. మరో యాంకర్ కి ముద్దులిస్తా అంటూ ఓపెన్ స్టేట్మెంట్!

యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. తన రూమర్డ్ లవర్ సుడిగాలి సుధీర్ కి షాక్ ఇచ్చింది. అతడికి వార్నింగ్ ఇస్తానని చెప్పింది. అదే సమయంలో మరొక స్టార్ యాంకర్ కి ముద్దులిస్తానని ఓపెన్ గా చెప్పింది. రష్మీ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుకున్న కారణం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 17, 2024 / 11:27 AM IST

    Sudigali Sudheer

    Follow us on

    Sudigali Sudheer: బుల్లితెర స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపు లభించలేదు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో యాంకర్ గా మారింది. జబర్దస్త్ షో ద్వారా స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. రష్మీ ఒరిస్సా కి చెందిన అమ్మాయి. అయినప్పటికీ వచ్చి రాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంది.

    జబర్దస్త్ యాంకర్ గా రష్మి ఫుల్ ఫేమ్ రాబట్టింది. స్టార్ యాంకర్ గా ఎదిగింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ – రష్మీ ల లవ్ ట్రాక్ బాగా హిట్ అయింది. ఈ జంటకు అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. రష్మీ – సుధీర్ మధ్య కెమిస్ట్రీ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత సుధీర్ సినిమాల్లో బిజీ అయిపోవడంతో ఈ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడింది. గతంలో రష్మీ హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంది.

    గుంటూరు టాకీస్, రాణిగారి బంగ్లా, అంతం వంటి సినిమాల్లో హీరోయిన్ నటించింది. ప్రస్తుతం రష్మీ యాంకర్ గా ఫుల్ ఫార్మ్ లో ఉంది. టీవీ షోలు, ఈవెంట్స్ వంటివి చేస్తూ బిజీగా గడుపుతోంది. వన్నె తరగని గ్లామర్ తో కట్టిపడేస్తుంది. రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అని చెప్పాలి. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. కొందరు కావాలనే రష్మీ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుంటారు.

    అలాంటి వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వదులుతుంటుంది. తాజాగా రష్మీ గౌతమ్ ఆన్లైన్ చాట్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ నెటిజన్ చెంప దెబ్బ, ముద్దు, వార్నింగ్… హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ కి ఇవ్వాల్సి వస్తే… ఏది ఎవరికి ఇస్తారు? అని అడిగాడు.

    సదరు ప్రశ్నకు సమాధానంగా రష్మీ గౌతమ్… హైపర్ ఆది టీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చెంప దెబ్బ ఇస్తాను. సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇస్తాను. యాంకర్ ప్రదీప్ కి ముద్దు ఇస్తానని చెప్పింది. అనూహ్యంగా తనతో రొమాన్స్ చేసిన సుడిగాలి సుధీర్ ని కాదని ప్రదీప్ కి ముద్దు ఇస్తానని చెప్పి షాక్ ఇచ్చింది రష్మీ. కాగా ఆన్ స్క్రీన్ లో మాత్రమే మేము లవర్స్ ఆఫ్ స్క్రీన్ లో కాదని రష్మీ గౌతమ్ పలుమార్లు వెల్లడించింది.

    36 ఏళ్ల రష్మీ గౌతమ్ ఇంకా వివాహం చేసుకోలేదు. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. ఇటీవల సుడిగాలి సుధీర్ తిరిగి యాంకర్ గా మారాడు. ది ఫ్యామిలీ స్టార్స్ అనే షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో రష్మీ గౌతమ్ సందడి చేస్తుంది.