Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh Daughter Engagement: గ్రాండ్ గా జరిగిన బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థం.. వైరల్...

Bandla Ganesh Daughter Engagement: గ్రాండ్ గా జరిగిన బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Bandla Ganesh Daughter Engagement: కమెడియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , ఆ తర్వాత స్టార్ నిర్మాతగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి బండ్ల గణేష్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు , తెలంగాణ లోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ లో ఒకరు, అంతే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలు, ఆయన ఇంటర్వూస్ లో చేసే కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం పాదయాత్రగా తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకున్నాడు. ఇది సోషల్ మీడియా లో చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే నేడు ఆయన తన కూతురు జనని కి సూర్య తేజ అనే అబ్బాయితో ఉదయం గ్రాండ్ గా నిశ్చితార్థం చేయించాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలిసి హాజరై వధూవరులను ఆశీర్వదించాడు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం , హీరో శ్రీకాంత్, శివాజీ, బోయపాటి శ్రీను తదితరులు ఈ నిశ్చితార్ధ మహోత్సవానికి హాజరయ్యారు. అయితే బండ్ల గణేష్ కి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. అందుకు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి నాజల్ సర్జరీ జరిగింది. డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో ఆయన ప్రస్తుతానికి విశ్రాంతి మోడ్ లోనే ఉన్నాడు. కనీసం పెళ్ళికి అయినా వస్తాడో లేదో చూడాలి.

ఇక పెళ్లి కొడుకు సూర్య తేజ విషయానికి వస్తే , ఈయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కుర్రాడు. సినీ పరిశ్రమకు , ఇతనికి ఎలాంటి సంబంధం లేదు కానీ, ఐటీ రంగం లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ , ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్లా ?, లేదంటే పెద్దలు కుదిరించిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది. రాబోయే రెండు నెలల్లో వీళ్ళ పెళ్లి జరిగే అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Srinu Kurasa (@srinu_kurasa)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular