Balayya vs Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో వాళ్ల అభిమానులకు ఆయా సినిమాల పట్ల తీవ్రమైన ఆసక్తి అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు అదే రేంజ్ లో బాలయ్య బాబు (Balayya Babu)-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఇద్దరు ఒకే రోజున వాళ్ళ సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ అయితే చేశారు…
బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ రీసెంట్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి నిన్న ఒక టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ లో 25 సెప్టెంబర్ 2025 వ తేదీన ఈ ను రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. మొత్తానికైతే బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ అతని అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద భారీ హైప్ నైతే క్రియేట్ చేసింది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా బాలయ్య బాబు ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఈ టీజర్ ని చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య బాబు రేంజ్ కి తగ్గట్టుగా టీజర్ ని బాగా కట్ చేశారు అంటూ ప్రశంసల వర్షమైతే కురిపిస్తున్నారు.
Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఓజి (OG) సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా సరే ఈ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో సుజిత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.
మరి ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2 పవన్ కళ్యాణ్ ఓజీ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ఏ సినిమాకి భారీగా నష్టం జరగబోతుంది. ఏ సినిమా సక్సెస్ఫుల్గా నిలుస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.
నిజానికి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రావడం వల్ల రెండు సినిమాలకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక సినిమా రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న హైపును బట్టి చూస్తే రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం వల్ల రెండింటికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది వాస్తవం…