https://oktelugu.com/

Unstoppable: బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో తర్వాత గెస్టులుగా జక్కన్న, పెద్దన్నలు

Unstoppable: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఆయన నటించిన అఖండ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ షో ఫస్ట్ ఎపసోడ్​కు మంచు మోహన్ బాబు రాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపుడిలతో రెండు, మూడు ఎపిసోడ్లను నిర్వహించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత నాలుగో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:56 AM IST
    Follow us on

    Unstoppable: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఆయన నటించిన అఖండ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ షో ఫస్ట్ ఎపసోడ్​కు మంచు మోహన్ బాబు రాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపుడిలతో రెండు, మూడు ఎపిసోడ్లను నిర్వహించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత నాలుగో ఎపిసోడ్​కు అఖండ టీమ్​ను దింపి నూతనోత్సాహాన్ని నింపారు. ఎక్కడా ఎంటర్​టైన్మెంట్ తగ్గకుండా బాలయ్య ఫుల్​ జోష్ నింపారు.

    Unstoppable Balayya

    https://twitter.com/ahavideoIN/status/1470981864366112768?s=20

    తాజాగా, ఈషో తర్వాత ఎపిసోడ్​లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ట్విట్టర్​ వేదికగా ఆహా తెలిపింది.

    Also Read: ఏపీ టికెట్​ ధరల విషయంలో తగ్గేదేలే అంటున్న బాలయ్య..

    కాగా, ఇటీవలే బాలయ్య చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు షో వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకోవడంతో.. మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లోనూ రాజమౌళి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఒక ఆటమ్​బాంబులాంటి వాడని పొగిడారు రాజమౌళి.

    కాగా, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెల్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు జక్కన్న.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ కూడా మొదలెట్టేశారు. ఇప్పటికే పలు చోట్ల ఇంటర్వ్యూలు ఇవ్వగా.. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్​గా మారాయి. మరోవైపు విడుదలైన ట్రైలర్​ కూడా అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది.

    Also Read: మంచి కథతో వస్తే మల్టీస్టారర్​కు రెడీ అంటున్న బాలయ్య