https://oktelugu.com/

Karthika Deepam: రుద్రాణి చెంప పగలకొట్టిన వంటలక్క.. దీప ఒడిలోకి చేరుకున్న మోనిత బిడ్డ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు ఎలా ఉందో చూద్దాం. తన బాబు కనబడటం లేదని మోనిత నేరుగా స్కూటీపై సౌందర్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. సౌందర్య వాళ్ళతో తన బాబు కనిపించడం లేదని మీరు ఎక్కడో దాచారు అని అంటుంది. ఇక సౌందర్య, ఆనంద్ రావు సంబంధం లేదు అని మేము దాచలేదని అంటారు. ఇక మోనిత వారి మాటలను నమ్మదు. దాంతో బాబు దొరికేవరకు ఇక్కడే ఉంటానని అక్కడే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2021 / 11:50 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ ఈ రోజు ఎలా ఉందో చూద్దాం. తన బాబు కనబడటం లేదని మోనిత నేరుగా స్కూటీపై సౌందర్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. సౌందర్య వాళ్ళతో తన బాబు కనిపించడం లేదని మీరు ఎక్కడో దాచారు అని అంటుంది. ఇక సౌందర్య, ఆనంద్ రావు సంబంధం లేదు అని మేము దాచలేదని అంటారు.

    Karthika Deepam Vantalakka

    ఇక మోనిత వారి మాటలను నమ్మదు. దాంతో బాబు దొరికేవరకు ఇక్కడే ఉంటానని అక్కడే సెటిల్ అవుతుంది. ఇక కార్తీక్ వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో రుద్రాణి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూసి ఇవన్నీ ఎవరివని అడుగుతుంది. ఇక కార్తీక్ సమాధానం చెప్పగా కార్తీక్ పై అరుస్తుంది. వెంటనే దీప.. రుద్రాణి పై కోపంతో రగిలిపోతూ తన చెంప పగలగొడుతుంది.

    Also Read: మోనిత బాబు మిస్సింగ్.. ఇదంతా ఆదిత్య పనే అంటూ?

    దాంతో రుద్రాణి దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తన చెంప పగలగొట్టినందుకు తిరిగి వారికి కోటేష్ అప్పులు తీర్చమని గట్టిగా చెబుతోంది. మరోవైపు కోటేష్ భార్య శ్రీవల్లి బిడ్డ ని కోల్పోయి ఏడుస్తుంది. ఇక కోటేష్ మోనిత బిడ్డను తానే కారులో నుంచి తీసుకుని వెళ్లి తన భార్య సంతోషం కోసం తప్పు చేయాల్సి వస్తుందని అనుకుంటూ మోనిత బాబును శ్రీవల్లి కి ఇస్తాడు. శ్రీవల్లి సంతోషంగా బాబును దగ్గరికి తీసుకుంటుంది.

    మరో వైపు మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచి దీపం పెడుతుంది. ఇక అందరూ వచ్చి మోనితను చూసి షాక్ అవుతారు. తరువాయి భాగంలో దీప శ్రీవల్లిని బిడ్డతో సహా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఇక కార్తీక్ బిడ్డను చూసి బిడ్డ రోజులు నిండిన బిడ్డలాగా కనిపిస్తున్నాడని అనటంతో కోటేశ్ షాక్ అవుతాడు. వెంటనే దీప అసలు ఏం జరిగిందో అని.. చెప్పు ఏం పర్వాలేదు అని కోటేష్ ను అడుగుతుంది.

    Also Read: బాలయ్య అన్​స్టాపబుల్​ షోలో తర్వాత గెస్టులుగా జక్కన్న, పెద్దన్నలు