https://oktelugu.com/

Harnaaz Sandhu: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్​ యూనివర్స్​.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్​

Harnaaz Sandhu: బహుశా తను కన్న కల చాలా గొప్పదనుకుంటా.. అసలు మళ్లీ ఇండియాను ఆ స్థానంలో చూడటం సాధ్యమా అనుకుంటున్న తరుణంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. మిస్​ యూనివర్స్​గా నిలిచి భారత్​కు మకుటాన్ని తెచ్చిపెట్టింది హర్నాజ్​ సంధూ. తన అందంతో పాటు అంతకుమించిన తెలివితేటలతో సుస్మతా సేన్​, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్​గా రికార్డు నెలకొల్పంది. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా ఇజ్రాయెల్​ ప్రయాణమైన హర్నాజ్​.. 80 దేశాలకు చెందిన సుందరాంగులను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 12:12 PM IST

    Harnaaz Sandhu

    Follow us on

    Harnaaz Sandhu: బహుశా తను కన్న కల చాలా గొప్పదనుకుంటా.. అసలు మళ్లీ ఇండియాను ఆ స్థానంలో చూడటం సాధ్యమా అనుకుంటున్న తరుణంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. మిస్​ యూనివర్స్​గా నిలిచి భారత్​కు మకుటాన్ని తెచ్చిపెట్టింది హర్నాజ్​ సంధూ. తన అందంతో పాటు అంతకుమించిన తెలివితేటలతో సుస్మతా సేన్​, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్​గా రికార్డు నెలకొల్పంది. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా ఇజ్రాయెల్​ ప్రయాణమైన హర్నాజ్​.. 80 దేశాలకు చెందిన సుందరాంగులను వెనక్కి నెట్టి మరీ మిస్​ యూనివర్స్​2021 టైటిల్​ను సొంతం చేసుకుంది.

    Harnaaz Sandhu

    Also Read: యాంక‌ర్లుగా చేసి హీరోయిన్లుగా మారిన వారు ఎంద‌రో తెలుసా..?

    ఈ క్రమంలోనే ఆమె ఎవరు?.. ఎక్కడనుంచి వచ్చారు. ఆమె బ్యాక్​గ్రౌండ్ ఏంటి? ఇలా హర్నాజ్​ గురించి గూగుల్​లో సర్చ్ చేయడం ప్రారంభించారు. సాధారణంగా మిస్​ వరల్డ్​, మిస్​ యూనివర్స్ లాంటి అందాల పోటీల్లో గెలుపొందిన వారంతా సిల్వర్​స్క్రీన్​పై మెరుస్తుంటారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్‌ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు.

    అయితే, హర్నాజ్​ ఈ విషయంలో కాస్త అడ్వాన్స్​గానే ఉందని చెప్పాలి. మిస్​ యూనివర్స్ పోటీలకు వళ్లేముందే పంజాబ్​లో  తన తొలి సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ చాలావరకు పూర్తయిందని.. వచ్చే ఏడాది మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుస్తోంది. దీంతో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మిస్​ యూనివర్స్​గా నిలిచిన సంధూపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    Also Read: నాగిని పాటకు స్టెప్పులు ఇరగదీసిన నటి ప్రగతి… ఫిదా అవుతున్న కుర్రకారు