Balakrishna: అలాంటి మరొక ఆడది లేదంటూ.. చనిపోయిన సిల్క్ స్మిత మీద బాలకృష్ణ సంచలన కామెంట్స్…

Balakrishna: బాల్యంలో తాను పడిన కష్టాలు రీత్యా కుటుంబ సభ్యులను ఆమె దగ్గరకు తీయలేదు. అదే ఆమెకు మైనస్ అయ్యింది. ఆమె చుట్టూ తోడేళ్ళు చేరి కబళించాయి.

Written By: S Reddy, Updated On : June 20, 2024 4:51 pm

Balakrishna Sensational Comments on Dead Silk Smitha

Follow us on

Balakrishna: బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మితను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మరలా తెరపైకి వచ్చాయి. ఒక విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడది లేదని ఆయన సంచలన కామెంట్స్ చేశాడు. విషయంలోకి వెళితే.. సిల్క్ స్మిత జీవితం సినిమాకు మించిన కథ. ఏలూరు సమీపంలో గల ఓ గ్రామంలో పుట్టిన విజయలక్ష్మి మద్రాసు పారిపోయింది. పేద కుటుంబంలో పుట్టడంతో బాల్యంలోనే వివాహం చేశారు. అత్తింటివారి బాధలు తట్టుకోలేక చేతిలో చిల్లిగవ్వ లేకుండా మద్రాస్ ట్రైన్ ఎక్కింది.

అలా ఒంటరిగా వెళ్లిన విజయలక్ష్మి… సిల్క్ స్మితగా మారింది. సౌత్ ఇండియాను షేక్ చేసింది. పట్టుదలతో తమిళ్, మలయాళ, కన్నడ భాషలు నేర్చుకుంది. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత ఐటెం సాంగ్స్ కి అంతగా ఫేమస్ అయిన నటి సిల్క్ స్మిత. ఆమె కేవలం స్పెషల్ సాంగ్స్ కి పరిమితం కాలేదు. గ్లామరస్, విలన్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. అప్పట్లో సిల్క్ స్మిత అంటే ఒక ప్రభంజనం. ఆమె మత్తు కళ్ళు చూస్తే కుర్రాళ్ళు చిత్తైపోయేవారు.

Also Read: Deepika Padukone: అంత కడుపుతో పెన్సిల్ హీల్స్ వేసుకొని ‘కల్కీ’ ఈవెంట్ కా?.. దీపికపై నెటిజన్ల పైర్

బాల్యంలో తాను పడిన కష్టాలు రీత్యా కుటుంబ సభ్యులను ఆమె దగ్గరకు తీయలేదు. అదే ఆమెకు మైనస్ అయ్యింది. ఆమె చుట్టూ తోడేళ్ళు చేరి కబళించాయి. ప్రేమించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు మోసం చేయడంతో… మానసిక వేదన అనుభవించింది. 1996లో సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె వయసుకు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. తన సూసైడ్ నోట్ లో కొందరి పేర్లు ప్రత్యేకంగా ఆమె ప్రస్తావించింది. వారిని దేవుడు శిక్షించాలని ఆమె కోరుకున్నారు.

Also Read: Trivikram Son: బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు… సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమా!

కాగా బాలకృష్ణతో సిల్క్ స్మిత కొన్ని సినిమాలు చేసింది. ఆదిత్య 369 లో సిల్క్ స్మిత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని రాజనర్తకి రోల్ చేసింది. ఇది నెగిటివ్ రోల్. కాగా ఓ సందర్భంలో బాలకృష్ణ ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను ఢీ కొట్టే మరొక ఆడది ఇండస్ట్రీ లేదు. ఆమె ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడుతుందో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేసేవారు’ అని బాలకృష్ణ అన్నారు. ఒక పల్లెటూరు అమ్మాయి అంతగా పరిశ్రమకు వెళ్ళాక తనను తాను మలచుకుందన్న మాట..