Kodali Nani: కొడాలి నానిలో మార్పు రాదా?

గతంలో కొడాలి నాని మాట్లాడితే చాలు నా బొచ్చు పీకలేరు. గుడివాడలో తనను ఓడించలేరు. చంద్రబాబు వచ్చినా పర్వాలేదు. లోకేష్ వచ్చినా పర్వాలేదు. వాడిది ముందుగా కుప్పంలో గెలవమను. అంటూ లేనిపోని కామెంట్స్ చేసేవారు.

Written By: Dharma, Updated On : June 20, 2024 4:50 pm

Kodali Nani

Follow us on

Kodali Nani: కొడాలి నాని ఫస్ట్ టైం నోరు తెరిచారు. మొన్న ఆ మధ్యన ఫలితాలు వచ్చిన తర్వాత టిడిపి,జనసేన శ్రేణులు తమపై దాడులకు దిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.వారిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఎక్కడా మీడియా ముందుకు రాలేదు కూడా. అయితే తాజాగా జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జాగ్రత్తగా మాట్లాడుతునే తన పాత శైలిని బయటపెట్టారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా తాను అలానే మాట్లాడతానని సంకేతాలు ఇచ్చారు. గుడివాడ ప్రజలు 47 వేల ఓట్లతేడాతో ఓడించారు.కానీ ఆయనలో పశ్చాత్తాపం కనిపించడం లేదు.ఓడిపోయానన్న బాధను బయట పెట్టడం లేదు.

గతంలో కొడాలి నాని మాట్లాడితే చాలు నా బొచ్చు పీకలేరు. గుడివాడలో తనను ఓడించలేరు. చంద్రబాబు వచ్చినా పర్వాలేదు. లోకేష్ వచ్చినా పర్వాలేదు. వాడిది ముందుగా కుప్పంలో గెలవమను. అంటూ లేనిపోని కామెంట్స్ చేసేవారు. వరుసగా ఐదు సార్లు గుడివాడ నుంచి గెలిచేసరికి నన్ను ఢీకొట్టేదెవరు అంటూ విజయ గర్వంతో మాట్లాడేవారు. కానీ ఈసారి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి ఎదురైంది. అయినా సరే కొడాలి నాని లో మార్పు కనిపించడం లేదు. మొన్నటికి మొన్న తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటిని చుట్టుముట్టారు. కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న కొడాలి నాని బయటకు రాలేదు. కానీ ఈరోజు జగన్ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో అందరి నాయకులతో పాల్గొన్నారు కొడాలి నాని. నాలో ఫైర్ తగ్గలేదు అన్నట్టు కామెంట్స్ చేశారు.

ఏవో మాయ మాటలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అలా గెలవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. సత్యం ధర్మం న్యాయం ఎప్పటికీ నిలబడుతుందన్నారు. రుషికొండపై నిర్మించిన భవనాలను జగన్ సొంత ఆస్తిగా టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారని… కానీ ఆయనేమీ సొంతంగా మాటిని నిర్మించుకో లేదన్నారు. ప్రభుత్వం కోసమే నిర్మించారని చెప్పారు. కానీ జగన్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ ప్రభుత్వ ఆస్తులు వినియోగించుకోలేదని.. ఇప్పుడు మాత్రం ఎందుకు వినియోగించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలు వాడుకునే కర్మ పట్టలేదని కొడాలి నాని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆ భవనాలను చంద్రబాబు వాడుకుంటారు.. ఆయన మనవడికి రాసిస్తారో.. ఆయన ఇష్టమని తేల్చి చెప్పారు. మొత్తానికైతే అన్నిటికీ సిద్ధపడి కొడాలి నాని బయట ప్రపంచానికి వచ్చినట్లు అర్థమవుతుంది. మరి టిడిపి, జనసేన శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.