Bala Krishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘అఖండ’ చిత్రంతో మొదలైన ఆయన బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో కొనసాగింది. ఇలా బాలయ్య వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడం గడిచిన రెండు దశాబ్దాలలో ఎప్పుడూ జరగలేదు. ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడంటే, నా తర్వాత వెంటనే నాలుగు డిజాస్టర్ ఫ్లాప్స్ పడేవి. అఖండ కి ముందు బాలయ్య కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. ఆ స్థాయిలో ఆయన మార్కెట్ పడిపోయింది. అలాంటి రేంజ్ నుండి, నేడు ఆయన వరుస హిట్స్ కొట్టి, ఆడియన్స్ లో బాలకృష్ణ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ అనే అనుభూతిని కలిగించాడు. ఆయన యవ్వనం ఉన్నప్పుడు కూడా చూడని పీక్ రేంజ్ స్టార్ స్టేటస్ ని 60 ఏళ్ళ వయస్సులో చూస్తున్నాడు బాలయ్య.
ఇదంతా పక్కన పెడితే ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లితో కలిసి బాలయ్య బాబు చేస్తున్న చిత్రానికి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ని ప్రకటిస్తూ నేడు ఒక గ్లిమ్స్ వీడియో ని మూవీ టీం విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, బాలయ్య కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని, ఈ చిత్రం తో కచ్చితంగా ఆయన వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకుంటాడని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి బాలయ్య బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళ్తే బాలయ్య ఈ సినిమా కోసం 45 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పొచ్చు.
థియేట్రికల్ రైట్స్ తో పాటుగా, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ బాగా జరిగే హీరోలకు నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్స్ ని ఇస్తున్నారు. ఇప్పుడు నా జాబితాలోకి బాలయ్య బాబు కూడా చేరిపోయాడు. అఖండ కి ముందు బాలయ్య రెమ్యూనరేషన్ కేవలం 10 కోట్ల రూపాయిల లోపే ఉంటుందట. నా స్థాయి నుండి నేడు ఆయన ఏ రేంజ్ కి వచ్చాడో మీరే చూడండి. ఇదే స్పీడ్ లో ఆయన క్వాలిటీ సినిమాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఆయన వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య బోయపాటి తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రం పై కేవలం నందమూరి అభిమానుల్లో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా తెరకెక్కనుంది.