https://oktelugu.com/

Matka Movie : ప్రొమోషన్స్ కోసం 5 కోట్లు ఖర్చు..కానీ 2 రోజుల్లో ‘మట్కా’ కి వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?

మొదటి నుండి ఈ సినిమాకి హైప్ లేకపోవడం వల్ల పెద్ద మైనస్ అయ్యింది. ఓపెనింగ్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత దారుణంగా వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.

Written By:
  • Vicky
  • , Updated On : November 15, 2024 / 09:50 PM IST

    Matka Movie

    Follow us on

    Matka Movie :  మెగా ఫ్యామిలీ లో సినిమా మీద ఫ్యాషన్ తో పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉండే హీరోలలో ఒకడు వరుణ్ తేజ్. భారీ అంచనాల నడుమ ఈయన సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటి ద్వారా వచ్చిన క్రేజ్ ని మాత్రం వరుణ్ తేజ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటే వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో అయ్యే రేంజ్ క్యాలిబర్ ఉన్న నటుడు. కానీ కొత్త రకమైన సినిమాలు చేసి ఆడియన్స్ ని థ్రిల్ గురి చెయ్యాలనే తాపత్రయంతో ఆయన చేస్తున్న ప్రయోగాలు వరుసగా విఫలం అవుతూ వస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘మట్కా’ చిత్రం కూడా నా కోవకి చెందిన సినిమాగా నిలిచిపోయింది. విడుదలకు థియేట్రికల్ ట్రైలర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

    కానీ మొదటి నుండి ఈ సినిమాకి హైప్ లేకపోవడం వల్ల పెద్ద మైనస్ అయ్యింది. ఓపెనింగ్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత దారుణంగా వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అది కూడా రిటర్న్ జీఎస్టీ ని కలిపితేనే. ఇక రెండవ రోజు అన్ని ప్రాంతాల్లో డే డెఫిసిట్స్ రావడంతో షేర్ వసూళ్లు రాలేదట. వీకెండ్ లో కాస్త పికప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మరో 30 లక్షల రూపాయిల షేర్ అదనంగా వచ్చే అవకాశం ఉందట. ఓవరాల్ క్లోజింగ్ రెండు కోట్ల రూపాయిల లోపే ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే ఈ సినిమాకి ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చు కూడా రానట్టే లెక్క.

    ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇలా విడుదలకు ఎన్నో ఈవెంట్స్ ని చేసిన మేకర్స్ కి దాదాపుగా 5 కోట్ల రూపాయిలు ప్రొమోషన్స్ కోసం ఖర్చు అయ్యిందట. విడుదలైన రెండు రోజులకు కలిపి ఆ 5 కోట్లలో సగం వసూళ్లు కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయలకు జరిగిందట. నిర్మాతలకు సాలిడ్ గా 23 కోట్ల రూపాయిల నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ‘దేవర’ చిత్రం తర్వాత దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్,క వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇలా వరుస హిట్స్ తో కళకళలాడిపోతున్న టాలీవుడ్ కి వరుణ్ తేజ్ ‘మట్కా’ పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగ నిల్చింది. వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకొని మంచి స్క్రిప్ట్ ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.