Akhanda: స్టార్ హీరోల సినిమాలు అంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది స్పెషల్ షోలే. అయితే, గత కొంతకాలంగా ఈ కరోనా కాలంలో స్పెషల్ షోలు కనిపించకుండా పోయాయి. హీరో ఎవరైనా సినిమా ఏదైనా స్పెషల్ షో అంటేనే ప్రభుత్వాలు నో చెప్పేస్తున్నాయి. ఎట్టి పరిస్థుతుల్లో అనుమతి ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఫ్యాన్స్ షోలకు అయితే అసలు పర్మిషన్ ఇవ్వడం లేదు.

అయితే, సహజంగా స్టార్ హీరోల సినిమాలకు హడావుడి మొదలయ్యేది ఫ్యాన్స్ షోలతోనే. అందుకే గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నాచితకా టౌన్స్ లో కూడా షోలు స్టార్ట్ అయ్యేవి. హైదరాబాద్ లో సైతం అలాగే ఏపీలో కూడా ఫ్యాన్స్ షోల హడావుడే వేరుగా ఉండేది. ప్రతీ పెద్ద సెంటర్లోనూ కచ్చితంగా ఓ స్పెషల్ షో వేసేవారు. ఇక ఈ స్పెషల్ షోల కోసం బయ్యర్లు అయితే ప్రత్యేక టికెట్ రేట్లు పెట్టి భారీ వసూళ్లు రాబట్టేవారు.
డిమాండ్ ను బట్టి టికెట్ రేటు ఉంటుంది. అయితే ఈ స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లను అడ్డగోలుగా పెంచుకుని అమ్ముకోవడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా నిరాకరిస్తోంది. ఇటు తెలంగాణలోనూ శాంతి భద్రతల సమస్యని చూపి పర్మిషన్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ హైదరాబాద్ లో బాలయ్య అభిమానులు అఖండతో ఫ్యాన్స్ షోలను మొదలు పెట్టాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
డిసెంబరు 2న అఖండ రిలీజ్ అవుతుంది. అంటే… డిసెంబరు 1 అర్థరాత్రి కచ్చితంగా ఫ్యాన్స్ షోలు వేయాలని బాలయ్య ఫ్యాన్స్ ప్లాన్. ఎలాగూ ఏపీలో ఫ్యాన్స్ షోకి పర్మిషన్ లేకపోవచ్చు. కానీ హైదరాబాద్ లో మాత్రం కచ్చితంగా స్పెషల్ షోలు పడాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుదలగా ఉన్నారు. ఏది ఏమైనా అఖండతో మళ్లీ స్పెషల్ షోల హంగామా స్టార్ట్ అయితే, మిగిలిన హీరోల సినిమాలకు కూడా స్పెషల్ షో ఆనవాయితీ మళ్ళీ మొదలవుతుంది.
Also Read: Rajamouli: టైం రా బాబు… రాజమౌళిని ఎగతాళి చేస్తున్న పవన్ ఫ్యాన్స్!
ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం.. అఖండ స్పెషల్ షోల కోసం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో రెండు థియేటర్లలో పర్మిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ పైసా వసూల్ సినిమాకు స్పెషల్ షోలు పడ్డాయి. అదే సెంటిమెంట్ ను ఈసారి కూడా కంటిన్యూ చేయాలని బాలయ్య అభిమానులు పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నారు.
Also Read: Mahesh Babu: ఆ హీరోయిన్ తో అక్కినేని హీరో విడాకులు… మహేష్ మనసుకు గాయమైన వేళ!