https://oktelugu.com/

Rajamouli: టైం రా బాబు… రాజమౌళిని ఎగతాళి చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

Rajamouli: అంతా పరిస్థితుల ప్రభావం… నాతో ఒక సినిమా చేయండి అంటూ స్టార్స్ ని తన వెనుక తిప్పుకునే రాజమౌళి, పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయాలని వేడుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం తగ్గి ప్రవర్తిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వస్తే రాజమౌళికి ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2021 / 10:17 AM IST
    Follow us on

    Rajamouli: అంతా పరిస్థితుల ప్రభావం… నాతో ఒక సినిమా చేయండి అంటూ స్టార్స్ ని తన వెనుక తిప్పుకునే రాజమౌళి, పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయాలని వేడుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం తగ్గి ప్రవర్తిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వస్తే రాజమౌళికి ఈ తిప్పలు ఉండేవి కావు. షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ శాతం తగ్గింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ ధరలు ఆశాజనకంగా లేవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య, పవన్ లాంటి స్టార్ హీరో మూవీ రోజుల వ్యవధిలో విడుదల కావడం… ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను దెబ్బతీస్తుంది. భీమ్లా నాయక్ విడుదల తర్వాత ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ నుండి మూవీని తొలగించాల్సి ఉంటుంది.

    ఆర్ ఆర్ ఆర్ పెట్టుబడితో పాటు, లాభాలు రాబట్టాలంటే ఓపెనింగ్స్ ద్వారానే 80% పైగా పెట్టుబడి రాబట్టాలి. అందుకే భీమ్లా నాయక్ నిర్మాతలు విడుదల వాయిదా వేసేది లేదని నిక్కచ్చిగా చెబుతున్నా, రాజమౌళి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమౌళి ఓ మెట్టు దిగి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సంధి ప్రయత్నాలు ఎంత వరకు ఫలితం ఇస్తాయో తెలియదు కానీ, పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఆయన లోకువ అయ్యారు.

    భీమ్లా నాయక్ ని చూసి రాజమౌళి భయపడుతున్నారని, మా హీరో పవన్ రేంజ్ అది అంటూ… ఎగతాళి చేస్తున్నారు. మీది పాన్ ఇండియా మూవీ కదా… మా భీమ్లా నాయక్ తో పోటీ పడటానికి ఎందుకు భయపడుతున్నారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. భీమ్లా నాయక్ ముందు ఆర్ ఆర్ ఆర్ అయినా… మటాషే, అందుకే రాజమౌళి బ్రతిమిలాడుకుంటున్నాడు అంటూ, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

    Also Read: Naveen chandra: ఆకట్టుకుటున్న తగ్గేదే లే పోస్టర్​.. క్రైమ్ థ్రిల్లర్​తో రానున్న నవీన్​

    తనకు ఇష్టమైన హీరోలతో ఒకటికి మూడు చిత్రాలు చేసిన రాజమౌళి, పవన్ కళ్యాణ్ తో ఒక్క చిత్రం కూడా చేయలేదు. ఈ అసహనం కూడా పవన్ ఫ్యాన్స్ లో ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న పవన్ డై హార్డ్ ఫ్యాన్స్… అదను దొరికింది కదా అని, కసి తీర్చుకుంటున్నారు.

    Also Read: Actress Regina: బ్రేకింగ్ న్యూస్ కి రెడీగా ఉండండి అంటున్న … నటి రెజీనా

    Tags