https://oktelugu.com/

Sarkaru Vari Pata: సర్కారు వారి పాట సూపర్​ ఫిల్మ్​.. నో డౌట్​ అంటున్న థమన్​

Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‏లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన టీమ్​..  దానికి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 10:28 AM IST
    Follow us on

    Sarkaru Vari Pata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‏లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన టీమ్​..  దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడం కూడా అందరికీ తెలిసిందే.

    కాగా, ఈ సినిమా ఎలా ఉండబోతోందని అభిమానలు అనుకుంటున్న తరుణంలో.. ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్​ చేసిన ట్వీట్స్​ సినిమాపై మరింత భరోసాను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా సాంగ్స్ అప్​డేట్స్​ గురించి స్పందిస్తూ.. ఈ సినిమా సూపర్​ గుడ్​ ఫిల్మ్ అనడంలో ఎలాంటి సందేహంలేదని.. చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా పాటలు రావాల్సిందని.. కానీ, విడుదల తేదీ ఏప్రిల్​కి వాయిదా పడటంతో పాటలను జనవరిలో రిలీజ్​ చేయాలనుకున్నట్లు వివరించారు.

    థమన్​ ఇంతలా చెప్తుంటే.. సినిమా కచ్చితంగా సూపర్​ హిట్​ అవుతుందని మహేశ్ అభిమానులు భావిస్తున్నారు.  ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలీష్ లుక్‏లో కనిపిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా పలు కారణాల వల్ల ఏప్రిల్ కు మార్చారు.