Homeఎంటర్టైన్మెంట్వందకోట్లు కోసం బాలయ్య తిప్పలు !

వందకోట్లు కోసం బాలయ్య తిప్పలు !

బాలయ్య బాబు ఖాతాలో ఇప్పటివరకూ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు లేవు అంటే.. అది బాలయ్య బాబుకే అవమానం. కానీ, ఆయన సినిమాలకు కలెక్షన్స్ రావడంలేదు. ఎన్ని సినిమాలు చేసినా పూర్తిగా డిజాస్టర్ లుగా మిగిలిపోతున్నాయి. ఆ మాటకొస్తే.. బాలకృష్ణ గత నాలుగు సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అంటే.. బాలయ్య మార్కెట్ రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఇండస్ట్రీలో ఓ జోక్ ఉంది. బాలయ్యకు కలెక్షన్స్ అంటే […]

Balakrishna
బాలయ్య బాబు ఖాతాలో ఇప్పటివరకూ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమాలు లేవు అంటే.. అది బాలయ్య బాబుకే అవమానం. కానీ, ఆయన సినిమాలకు కలెక్షన్స్ రావడంలేదు. ఎన్ని సినిమాలు చేసినా పూర్తిగా డిజాస్టర్ లుగా మిగిలిపోతున్నాయి. ఆ మాటకొస్తే.. బాలకృష్ణ గత నాలుగు సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అంటే.. బాలయ్య మార్కెట్ రేంజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఇండస్ట్రీలో ఓ జోక్ ఉంది. బాలయ్యకు కలెక్షన్స్ అంటే అస్సలు నచ్చదట. ఎవరైనా మన సినిమాకి ఇన్ని కలెక్షన్స్ అనగానే బాలయ్యలో కోపం కట్టలు తెచ్చుకుంటుందట.

Also Read: సండే స్పెషల్ : పాన్ ఇండియా హీరోలుగా.. తెలుగు హీరోలు !

కానీ, తన సినిమా డిజాస్టర్ అయి డబ్బులు మొత్తం పోయి, నిర్మాతలు అప్పులుపాలు అయిపోతున్నా, బాలయ్య మాత్రం ఎప్పుడూ కలెక్షన్స్ గురించి ఆలోచించరు. అయితే, తాజాగా కలెక్షన్స్ విషయంలో బాలయ్య బాగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బాలయ్య ఈసారి తన సినిమా కలెక్షన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ప్రస్తుతం బోయపాటితో చేస్తోన్న సినిమాతో తానూ వంద కోట్ల క్లబ్ లో చేరాలని బాలయ్య ప్రస్తుత టార్గెట్ గా పెట్టుకుని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇందులో భాగంగా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటే వంద కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అనేది బాలయ్య టీమ్ అభిప్రాయం.

Also Read: లవ్ స్టోరీ టీజర్ టాక్: నిరుద్యోగ ప్రేమ కంచికి చేరిందా?

అందుకే బోయపాటికి గత కొన్ని రోజులుగా క్లాస్ లు పీకుతున్నారు. సినిమాని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయమని. కానీ బోయపాటి మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా సినిమా చేస్తా.. ఇక మిగతా ఆడియన్ల దృష్టిని ఆకట్టుకోవడం మన చేతుల్లో లేదంటూ చెప్పుకోస్తున్నాడట. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ లో.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి నచ్చే మంచి కామెడీ ట్రాక్ ను యాడ్ చేశాడట. ఏమైనా వంద కోట్లు మార్కెట్ కోసం బాలయ్య తన బాడీని తగ్గించడానికి కూడా తెగ కష్టపడుతున్నాడట. మరి బాలయ్య కష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నిజానికి బాలయ్యకి ఒకప్పుడు బాక్సాపీస్ బొనాంజా అని ప్రత్యేకమైన పేరు కూడా ఉండేది. ఇప్పుడు లేదు అనుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper