OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ అభిమానులనే కాకుండా, ప్రేక్షకులను కూడా విశేషం గా ఆకట్టుకుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసాడు. ఆయన అలా రీమేక్ సినిమాలు చేయడం వల్ల మామూలు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా, ఆయన ఓజీ చిత్రాన్ని ప్రకటించడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అదే విధంగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియో విడుదల అయ్యాక ఆ అంచనాలు పదింతలు అయ్యాయి.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నామని మేకర్స్ నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియా అంతటా సెన్సేషనల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ లుక్ లో చూసి చాలా కాలం అయ్యిందని, ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా చాలా రోజుల వరకు ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం తో అక్టోబర్ నెలలో విజయవాడ లోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు మేకర్స్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దసరా కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రానికి బదులుగా సెప్టెంబర్ 27 న ‘దేవర’ చిత్రం విడుదల అవ్వడం, ఆ సినిమా క్రేజ్, ఓపెనింగ్ వసూళ్లు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ తేదీన మన సినిమా రావాల్సింది. వచ్చి ఉండుంటే వసూళ్ల సునామి వేరే లెవెల్ లో ఉండేది, కేవలం 20 రోజుల షూటింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేసి ఉండుంటే, ఈపాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఉండేది, మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఓజీ మంచి క్రేజ్ ఉన్న సినిమా అని, దానికి సీజన్ తో ఎలాంటి అవసరం లేదని, ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతాయని, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి అందరూ రుచి చూస్తారని అంటున్నారు అభిమానులు, చూడాలి మరి.