Maruti Alto
Maruti Alto : దేశంలోని అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి ఇండియా పాపులర్ కారు మారుతి ఆల్టో మైలేజీ త్వరలో గతంలో కంటే మరింత పెరుగనుంది. మారుతి సుజుకి ఇండియా పదో జనరేషన్ ఆల్టో మోడల్ డెవలప్ చేస్తుంది. ఇది త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతుంది.ఇందుకోసం కంపెనీ ఈ కారులో కీలక మార్పులు చేయబోతుంది. మారుతి సుజుకి మారుతి ఆల్టో బరువును 100 కిలోలు తగ్గించాలని ఆలోచిస్తోంది. అయితే, ఈ పని చేయడం పెద్ద సవాలే. అయినప్పటికీ, కంపెనీ దాని కోసం కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది.
Also Read :రూ.5 లక్షలకే 8ఏళ్ల వారంటీతో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల
మారుతి సుజుకి కొత్త ఆల్టో 2026 నాటికి విడుదల కానుంది. ఈసారి కారు బరువును 100 కిలోలు తగ్గించి 580 కిలోలకు తగ్గించేందుకు కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం మారుతి ఆల్టో కనీస బరువు 680 కిలోలు. దీనికోసం కారులో బరువు తక్కువగా ఉన్నప్పటికీ బలంలో కారు బాడీ స్ట్రాంగ్ గా ఉండే విధంగా కొత్త పదార్థాన్ని తయారీలో ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికోసం కంపెనీ అల్ట్రా-హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించవచ్చు. అలాగే, ఈ కారును కొత్త అధునాతన హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయవచ్చు.
మారుతి సుజుకి వివిధ వేరియంట్‌లను బట్టి దీని బరువు ప్రస్తుతం 680 కిలోల నుండి 760 కిలోల వరకు ఉంటుంది. 2024లో జరిగిన ఒక కార్యక్రమంలో మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి కొత్త తరం ఆల్టోలో చాలా బరువు తగ్గింపు ఉంటుందని తెలిపింది. కొత్త జనరేషన్ ఆల్టో బరువు 580 కిలోల నుండి 660 కిలోల వరకు ఉంటుంది. గతంలో 6వ తరం మారుతి ఆల్టో బరువు 72 కిలోల నుండి 810 కిలోల వరకు ఉండేది.
కారు బరువు తగ్గడం వల్ల, మారుతి ఆల్టో కస్టమర్లకు అతిపెద్ద ప్రయోజనం మైలేజ్ పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, కారు పర్ఫామెన్స్ కూడా పెరుగుతుంది. దీని వలన వాహన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కొత్త మారుతి ఆల్టోలో కంపెనీ 657సీసీ 3-సిలిండర్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది 49ps పవర్ ని, 58 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో కంపెనీ 1.9 కిలోవాట్ల ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ కిట్‌ను అందించగలదు. దీని వలన కారు మైలేజ్ కూడా మెరుగుపడుతుంది.
Also Read: కార్ల బుకింగ్స్ కు తత్కాల్ స్కీం.. 35ఏళ్ల క్రితమే దేశంలో అమలు.. దాని స్పెషాలిటీ ఏంటంటే ?