https://oktelugu.com/

Akhanda 1st day Collections: బాలయ్య వసూళ్ల ప్రభంజనం… వకీల్ సాబ్ కి చెక్ పెట్టిన అఖండ!

Akhanda 1st day Collections: నటసింహం బాలకృష్ణ అఖండ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంక్రాంతి ముందే జరుపుకుంటున్నారు. అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది. కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్స్ వద్ద ఈ స్థాయిలో జనాలను చూడలేదు. బాలయ్య-బోయపాటి మూవీ కోసం సినిమా ప్రియులు, ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. ఇక మొదటి షో నుండే అఖండ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : December 3, 2021 / 11:48 AM IST
    Follow us on

    Akhanda 1st day Collections: నటసింహం బాలకృష్ణ అఖండ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంక్రాంతి ముందే జరుపుకుంటున్నారు. అఖండ థియేటర్స్ వద్ద కోలాహలం నెలకొంది. కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్స్ వద్ద ఈ స్థాయిలో జనాలను చూడలేదు. బాలయ్య-బోయపాటి మూవీ కోసం సినిమా ప్రియులు, ఫ్యాన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. ఇక మొదటి షో నుండే అఖండ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. అఖండ థియేటర్స్ ఈలలు, గోలలతో దద్దరిల్లి పోతున్నాయి. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు కుర్చీలలో నిలువలేకున్నారు.

    Akhanda 1st day Collections

    ఇక సినిమాకు పాజిటివ్ టాక్ దక్కిన నేపథ్యంలో వసూళ్ల వరద పారింది. అఖండ రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంది. అఖండ పై భారీ హైప్ ఏర్పడగా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనం ఇచ్చాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మొదటిరోజు అఖండ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి రూ. 10 కోట్ల షేర్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర ఏరియాల్లో అఖండ భారీగా వసూళ్లు దక్కించుకుంది. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడులోను అఖండ కలెక్షన్స్ అదుర్స్ అన్న మాట వినిపిస్తుంది.

    Also Read: అప్పటి బాలయ్య-బి.గోపాల్​ కాంబో హిట్​ మళ్లీ బోయపాటితో తిరిగొచ్చిందా?

    ఇక ఓవర్ సీస్ లో అఖండ దుమ్మురేపింది. సాధారణంగా ఓవర్ సీస్ లో బాలయ్య సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. ఇక్కడ భారీ హిట్స్ కొట్టిన చిత్రాలకు కూడా నామమాత్రపు వసూళ్లు దక్కుతాయి. అఖండ మూవీ మాత్రం భిన్నంగా విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ ప్రీమియర్ వసూళ్ళలో వకీల్ సాబ్ రికార్డు బద్దలు కొట్టింది. 2021 సంవత్సరానికి గాను అత్యధిక ప్రీమియర్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అఖండ ప్రీమియర్స్ ద్వారా 3.25 డాలర్ల వసూళ్లు అందుకోగా.. వకీల్ సాబ్ చిత్రం 3 లక్షల డాలర్స్ రాబట్టింది. లాంగ్ వీకెండ్ కలిగి ఉన్న అఖండ చిత్రానికి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు లేని పక్షంలో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం కలదు.

    Also Read: 2021లో అత్యధిక టీఆర్పీ సాధించిన చిత్రాలివే..!

    Tags