AIIMS Recruitment:ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న క్యాంపస్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 169 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 169 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 37 ఉండగా అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 31, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 52, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 49 ఉన్నాయి. డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీతో పాటు టీచింగ్/పరిశోధనలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: కడప డీసీసీబీలో 75 ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?
ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,42,506 రూపాయల నుంచి 2,20,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ప్రక్రియ చేపడతారు. రిక్రూట్‌మెంట్ సెల్ సెకండ్ ఫ్లోర్, మెడికల్ బిల్డింగ్ గేట్ నెం–5, ఎయిమ్స్ రాయ్‌పూర్, జి.ఇ.రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్–4920999 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.
2021 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
Also Read: ఎన్‌బీసీసీలో 70 ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్షన్నరకు పైగా వేతనంతో?