Pushpa: నార్త్​లో పుష్పరాజ్​ సందడి షురూ.. ప్రమోషన్స్​కు సర్వం సిద్ధం

Pushpa: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” పుష్ప”. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 3, 2021 11:50 am
Follow us on

Pushpa: సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం” పుష్ప”. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , పాటలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా, సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో.. మేకర్స్​ ప్రమోషన్స్​కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నార్​ ఆడియన్స్​కు దగ్గరయ్యేవిధంగా పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్​లో హిందీ పర్షన్​ టీజర్​ను థియేట్రికల్​గా చూపించడం స్టార్ట్​ చేశారు. అల్లు అర్జున్ ఈ సినిమాతోనే బాలీవుడ్​లో అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ కెరీర్​లో హిందీ మార్కెట్​ చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇటీవలే ఈ సినిమాను హిందీలో రిలీజ్​ చేయడంపై తలెత్తిన వివాదం కూడా తీరిపోవడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇన్ని ఎక్స్​పెక్టేషన్స్​ మధ్య సినిమా ఎలా సక్సెస్​ అవుతుందో తెలియాలంటే.. విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఇందులో సమంత కూడా నటిస్తుండటం విశేషంగా మారింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్​లో సామ్ కనిపించనుంది.