https://oktelugu.com/

Bala Chandra Kumar : ప్రముఖ హీరోయిన్ కేసు లో కీలక సాక్షి అయిన బాల చంద్ర కుమార్ మరణించారు… ఇంతకీ ఆ కేసు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ దూరం నుంచి చూసేవాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు.

Written By: , Updated On : December 13, 2024 / 10:49 AM IST
Bala Chandra Kumar

Bala Chandra Kumar

Follow us on

Bala Chandra Kumar : సినిమా ఇండస్ట్రీ దూరం నుంచి చూసేవాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఒకవేళ సక్సెస్ వచ్చిన కూడా దాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత ఆశా మాషి వ్యవహారం అయితే కాదు. ఎన్నో రిస్ట్రిక్షన్స్ ముందుకు సాగితేనే ఇక్కడ హీరోలుగా గాని, నటులుగా గాని మంచి గుర్తింపును సంపాదించుకుంటారు…లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన ఏ విషయం బయటకి లీకైన కూడా వాళ్ల కెరియర్ మీద చాలావరకు ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్లు ఎలా ఉంటారు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళ అభిమానులతో పాటు యావత్ సినిమా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా తమ కెరియర్ ని బిల్డ్ చేసుకుంటే అంత జాగ్రత్తగా ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇదిలా ఉంటే కేరళలోని ఒక ప్రముఖ నటి మీద 2017 వ సంవత్సరంలో దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో కీలక సాక్షిగా ఉన్న సినీ నిర్మాత బాలచంద్ర కుమార్ శుక్రవారం ఉదయం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు…

ఇక గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈయన చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న చాలామంది సినిమా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు… ఇక నటుడు దిలీప్ నటి భావనను కిడ్నాప్ చేసిన కేసు లో బాలచంద్ర కుమార్ విడుదల చేసిన వివరాలు కీలకంగా మారాయి…

అయితే నటుడు దిలీప్ భావనను చాలా వరకు ఇబ్బంది పెట్టాడట…అప్పట్లో విచారణను చెపట్టిన కేరళ పోలీసులు దిలీప్ తో పాటు లోకల్ రౌడీ షీటర్ అయిన సునీల్ కూడా ఆమెను కిడ్నాప్ చేయడం కి దిలీప్ కి హెల్ప్ చేశారని వాళ్ళు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే దిలీప్ బల చంద్ర కుమార్ ఇంట్లో దాడికి సంభందించిన సీసీ టీవీ పుటేజ్ ను చూశాడని తెలియజేశారు. ఇక ఈ కేసు లో కీలక నిందుతుడు అయిన పల్సర్ సునీల్ ని ఆ ఘటన జరగటానికి రెండు నెలల ముందు దిలీప్ ఇంట్లో కలిశానని చెప్పాడు…

అలాగే దిలీప్ వాళ్ల బ్రదర్ అయిన అనూప్ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు దిలీప్ తనని పరిచయం చేశాడని చెప్పాడు…ఇక ఈయన చెప్పిన విషయాన్ని దిలీప్ మొదట ఖండించినప్పటికి ఆ తర్వాత ఒప్పుకున్నాడు…ఇక అలాంటి కేసు లో కీలక సాక్షి గా ఉన్న వ్యక్తి చనిపోవడం తో యావత్ ఇండియా మొత్తం ఆయన మరణం పట్ల అశ్రు నివాళిని తెలియజేస్తున్నారు…