Baby John Movie Review : నేడు భారీ అంచనాల మధ్య వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ ఇండియన్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ :
కేరళలోని అల్లపుజాలో జాన్ డిసిల్వా వరుణ్ ధావన్ తన కుమార్తె ఖుషి తో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. జాన్ ఖుషి టీచరైన తార వామిక గబ్బి కి దగ్గర అయినప్పుడు జాన్ జీవితం మొత్తం మారిపోతుంది. ఊహించని సంఘటన జరగడం వలన అతని నిజమైన గుర్తింపు వెలుగులోకి వస్తుంది. జాన్ నిజానికి ముంబైకి చెందిన ఒక శక్తివంతమైన అధికారి డిసిపి అని తారా తెలుసుకుంటుంది. జాన్ ఎందుకు తన మరణాన్ని నకిలీ చేశాడు అలాగే అతను దేని నుండి నడుస్తున్నాడు నానాజీ జాకిషరఫ్ ఎవరు వీళ్ళ మధ్య విభేదాలకు కారణమేంటి అనేది ఈ కథలోని ప్రధానాంశాలు.
ప్లస్ పాయింట్లు:
ఒక పోలీస్ అధికారిగా మరియు ఒక బేకరీ ని నడిపే బాధ్యత గల తండ్రిగా వరుణ్ ధావన్ నటన అద్భుతమని చెప్పొచ్చు. అతని లుక్స్ మరియు ఫిజిక్స్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. వామికా గబ్బి పాత్ర సమయం పరిమితంగా ఉన్నప్పటికీ ఆమె చాలా బాగా నటించింది అని తెలుస్తుంది. కీర్తి సురేష్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈ సినిమాకు ప్రధానమని తెలుస్తుంది. జాకీ షరాఫ్ నటన కూడా ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్లు:
ఈ సినిమా విజయ్ నటించిన థెరి సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అయినప్పటికీ ఈ సినిమా రీమేక్ ను చేసేటప్పుడు కథను మరింత డెవలప్ చేసి అందులోని పాత్రలు మరింత బలంగా ఉండాలి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ తో ఒకే ప్లాట్ కు అతుక్కుపోవడం ఈ ఈ సినిమాలో కొత్తవి ఏంటి అనే ప్రశ్నను తలెత్తే లా చేస్తున్నాయి. వరుణ్ ధావన్ కీర్తి సురేష్ కి మధ్య జరిగే లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.
తమన్ మ్యూజిక్ :
ఈ సినిమాకు మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ తమన్ అందించాడు. క్లైమాక్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కామెడీ యాక్షన్ సీన్స్ వర్క్ అవుట్ అయినట్టు ఎమోషనల్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఒరిజినల్ సినిమా చూసిన వాళ్ళకి ఇవి పెద్దగా కనెక్ట్ కావనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించడం.
సినిమా పేరు : బేబీ జాన్
నటీనటులు : వరుణ్ ధావన్, కీర్తి సురేష్, జాకీ షరాఫ్, వామికా గబ్బి, రాజ్పాల్ యాదవ్ తదితరులు.
దర్శకుడు : కాలీస్
నిర్మాతలు : మురద్ ఖేతని, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్ పాండే
సంగీత దర్శకుడు: తమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్ : కిరణ్ కౌశిక్