Crazy Heroine: ఇప్పుడు మనం చెప్పుకోబోయే లేడీ వకీల్ సాబ్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకున్న ఈమె బుల్లితెర నటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఈమె వెండితెరకు పరిచయమై పలు సినిమాలలో హీరోయిన్గా రాణించింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన సినిమా కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలను అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా పరాజయాలను పొందింది. దాంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో సెటిల్ అయిపోయింది. ఇక అదే సమయంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసి ప్రస్తుతం సుప్రీంకోర్టులో లేడీ వకీల్ సాబ్ గా పనిచేస్తుంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్ గా తన విధులను నిర్వహిస్తున్న ఈ లేడీ వకీల్ సాబ్ మరెవరో కాదు రేష్మా రాథోడ్. ఈ రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల దృష్టి మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న అందాల తార రేష్మ రాథోడ్. రేష్మ తెలంగాణలోని భద్రాద్రి కొత్త చెందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత హీరో వెంకటేష్ త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. బాడీగార్డ్ సినిమా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రేష్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత అదే ఏడాది దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ రోజుల్లో అనే యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది రేష్మా రాథోడ్. ఈ సినిమాలో రేష్మ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న రేష్మ ఆ తర్వాత హీరో ఉదయ్ కిరణ్ తో కలిసి జైశ్రీరామ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు అని తెలుస్తుంది.
ఆ తర్వాత రేష్మ రాథోడ్ లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం అనే సినిమాలలో నటించింది. తెలుగు తో పాటు ఈమె తమిళ, మలయాళ భాషలలో కూడా సినిమాలలో నటించింది. కానీ ఈమె నటించిన కొన్ని సినిమాలు పరాజయం పొందడంతో యాక్టింగ్ పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో చేరింది. రేష్మ రాథోడ్ బిజెపి పార్టీలో కొనసాగుతుంది.
అదే సమయంలో లాయర్ కోర్సు పూర్తి చేసిన రేష్మ ప్రస్తుతం లాయర్ గా తన విధులు నిర్వహిస్తుంది. అయితే రేష్మ రాథోడ్ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ లాయర్ గా తనదైన శైలిలో రాణిస్తుందని సమాచారం. రేష్మ రాథోడ్ కు ఈ ఏడాది జూలైలో సుప్రీం కోర్ట్ లాయర్ గా పదోన్నతి లభించింది.