https://oktelugu.com/

Nithin : నితిన్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా.. ఈసారి నితిన్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!

ఐపీఎల్ ప్రారంభానికి ముందుకు మన ఇండియన్స్ కి ఎక్కువగా మన ఇండియన్ ప్లేయర్స్ ని మాత్రమే ఆరాధించేవారు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ సీజన్ మొదలైందో అప్పటి నుండి ఇతర దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ ని కూడా విపరీతంగా అభిమానించడం ప్రారంభించారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 22, 2024 / 08:03 PM IST

    Australian cricket legend David Warner in Nithin's movie

    Follow us on

    Nithin : ఐపీఎల్ ప్రారంభానికి ముందుకు మన ఇండియన్స్ కి ఎక్కువగా మన ఇండియన్ ప్లేయర్స్ ని మాత్రమే ఆరాధించేవారు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ సీజన్ మొదలైందో అప్పటి నుండి ఇతర దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ ని కూడా విపరీతంగా అభిమానించడం ప్రారంభించారు. అలా ఫారిన్ ప్లేయర్స్ క్యాటగిరీ లో మన ఇండియన్స్ అత్యధికంగా ఇష్టపడేది డేవిడ్ వార్నర్. ఈయన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో ఎన్నో సంవత్సరాలు ఆడాడు. ఆ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి రెండు సార్లు కప్ కూడా అందుకునేలా చేసాడు. అందుకే డేవిడ్ వార్నర్ అంటే మన ఇండియన్స్ కి అంత ఇష్టం. ప్రస్తుతం ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ టీం లో కొనసాగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే డేవిడ్ వార్నర్ కి మన ఇండియన్ సినిమాలంటే పిచ్చి.

    తన ఇంస్టాగ్రామ్ లో మన ఇండియన్ సినిమాలకు సంబంధించిన రీల్స్ ఎన్నో చేసాడు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు అంటే ఆయనకీ ఎంతో ప్రత్యేకమైన ఇష్టం. అల్లు అర్జున్ సినిమాలంటే డేవిడ్ వార్నర్ కి చాలా ఇష్టం. ఆయన నటించిన ‘పుష్ప’, ‘అలా వైకుంఠపురం లో’ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ వేస్తూ ఆయన చేసిన రీల్స్ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. అంతే కాదు తెలుగు సినిమాల్లో నాకు అవకాశం వస్తే నటించాలని ఉంది అంటూ డేవిడ్ వార్నర్ ఎన్నో సందర్భాలలో తెలిపాడు. కొన్ని నెలల క్రితమే ఆయన డైరెక్టర్ రాజమౌళి తో కలిసి చేసిన ఒక యాడ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ యాడ్ లో వార్నర్ కామెడీ టైమింగ్ కి నవ్వని వారంటూ ఎవరూ లేరు. అయితే మొత్తానికి ఇప్పుడు ఆయన వెండితెర మీద మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రాబిన్ హుడ్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నితిన్, వెంకీ కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు సంబంధించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రం లో డేవిడ్ వార్నర్ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే లాగా ఉంటుందట. అంతే కాదు ఈ సినిమాకి స్వయంగా డేవిడ్ వార్నర్ తెలుగు లో డబ్బింగ్ కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. చేతిలో గన్ను పెట్టుకొని స్టైలిష్ గా నవ్వుకుంటూ నడుస్తున్న డేవిడ్ వార్నర్ లుక్ ని చూసి ఆయన అభిమానులు మా తెలుగు లో ఒక సినిమా హీరో గా చెయ్యి అని కోరుకుంటున్నారు. డేవిడ్ భాయ్ కి సినిమాల మీద అమితాసక్తిని గమనించి ఎవరైనా ఈయన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తారో లేదో చూద్దాం.