Kollywood : సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కొంతమందికి చాలా మంచి పేరు అయితే ఉంటుంది. కానీ వాళ్ళ సక్సెస్ ని స్టార్ డమ్ గా మార్చుకోవడంలో వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోతూ ఉంటారు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆ దర్శకులకు పెద్దగా అవకాశాలు రావు. కాబట్టి వాళ్ళ సక్సెస్ లను స్టార్ డమ్ గా మార్చుకోవాలంటే మాత్రం పాన్ ఇండియా సినిమాలను తప్పకుండా చేయాల్సిందే అని సినీ పండితులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. శంకర్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులను పక్కన పెడితే వాళ్ల తర్వాత భారీ ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో బాలా, వెట్రి మారన్ లాంటి దర్శకులు అంటారు. వీళ్ళు ఆర్ట్ ఫిలిమ్స్ ని ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అలాగే వీళ్ళ సినిమాల్లో లోకల్టీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో పాటు గా తమిళనాడు ఫ్లేవర్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళ సినిమాలను తమిళ్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇక వీళ్ళ సినిమాలు మిగతా భాషల్లో పెద్దగా సక్సెస్ లను సాధించనప్పటికీ తమిళంలో మాత్రం మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటాయి… ఇక ఇలాంటి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమయ్యే సినిమాలను చేస్తున్నారు. నిజానికి పాన్ ఇండియా సబ్జెక్టులను డీల్ చేయగలిగే సత్తా ఉన్న వీళ్ళిద్దరూ తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వడం ఇప్పుడు చాలామంది ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి.
ఎందుకంటే వీళ్ళు చెప్పే కంటెంట్ చాలా ఒరిజినల్ గా, జెన్యూన్ గా ఉంటుంది. అందువల్ల ఆ కంటెంట్ ని ఇండియన్ ఆడియన్స్ చూసే అవకాశన్నైతే మిస్ అవుతున్నారు. తమిళ్ లాంగ్వేజ్ లోనే వీళ్ళు సినిమాలను చేయడం వల్ల ఇండియా లో ఉన్న ప్రేక్షకులందరు వీళ్ళ సినిమాలను చూడలేకపోవచ్చు.
కానీ పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తే వాళ్లు రాసుకున్న కథకి వాళ్ళు చేసిన సినిమాకి ఎక్కువ ఆదరణ దక్కే అవకాశం కూడా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు దర్శకులు ఎందుకు పాన్ ఇండియా సినిమాలను చేయడం లేదనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వీళ్ళిద్దరికీ కూడా సపరేట్ స్టైల్ ఉంది. అందుకే వీళ్ళ సినిమాల్లో నటిస్తే తప్పకుండా అవార్డ్స్ వస్తాయని ప్రతి ఒక్క హీరో కూడా కోరుకుంటూ ఉంటాడు. స్టార్ డమ్ రావాలంటే కమర్షియల్ సినిమాలను చేస్తే సరిపోతుంది.
కానీ అవార్డులు రావాలంటే మాత్రం ఇలాంటి దర్శకులతోనే పని చేయాలి అని మన తెలుగు స్టార్ హీరోలు సైతం వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వీళ్ళు పాన్ ఇండియా సినిమా చేస్తే చూడడానికి అటు తమిళ్ ఆడియన్స్ తో పాటు ఇండియన్ ప్రేక్షకులు కూడా చల్ అసక్తి తో ఉన్నారు. ఇక వీలైనంత తొందర్లోనే వీళ్ళ నుంచి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుందని కూడా చాలామంది సినీ మేధావులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి వీళ్ళు పాన్ ఇండియా సినిమా చేస్తే ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారు అనేది…