Director Shankar : శంకర్ ప్లాప్ లకు కారణం ఏంటి..? ఆ ఒక్కటి చేయకుండా ఉంటే ఇప్పటికీ ఆయన టాప్ డైరెక్టర్ గానే ఉండేవాడు…

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ దర్శకులకు మాత్రం చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోలను తయారు చేసింది దర్శకులే కాబట్టి అక్కడ హీరోలతో పాటు దర్శకులకు కూడా సమానమైన గుర్తింపు ఇస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 22, 2024 8:36 pm

Director Shankar

Follow us on

Director Shankar : తమిళంలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ శంకర్ కి ఉన్న గుర్తింపు మరే దర్శకుడికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. జెంటిల్ మెన్ సినిమా నుంచి మొన్న వచ్చిన భారతీయుడు 2 సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ వస్తున్నాడు. ఇక అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, తన మార్క్ గ్రాండియర్ ని మాత్రం ఎక్కడా పోగొట్టుకోకుండా దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ ఈ జనరేషన్ లో ఉన్న డైరెక్టర్లకు సైతం ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. మరి ఇలాంటి దర్శకుడు తమిళ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తమిళ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అయితే రోబో సినిమా వరకు వరుస సక్సెస్ ని అందుకున్న శంకర్ ఆ సినిమా తర్వాత నుంచి సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోతున్నాడు. నిజానికి రోబో లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న తర్వాత శంకర్ ‘త్రీ ఇడియట్స్’ సినిమాని స్నేహితుడు పేరుతో రీమేక్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ సినిమా వల్లే శంకర్ చాలా వరకు ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.

త్రి ఇడియట్స్ రీమేక్ వల్ల అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో శంకర్ పేరు భారీగా డ్యామేజ్ అయింది. ఇక ఆ తర్వాత చేసిన ‘ఐ ‘ సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. ఆ సినిమాలో ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఫాల్ట్ వల్లే అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చేసిన రోబో 2 పరిస్థితి కూడా అదే మాదిరిగా తయారైంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘భారతీయుడు 2 ‘ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది.

ఇక శంకర్ వరుస ప్లాప్ ల వెనుక ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని కొంతమంది సినీ మేధావులు చెబుతున్నారు. ఎందుకు అంటే ఆయన కథల సెలక్షన్ లో అస్సలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు శంకర్ నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే కథ ఎలా ఉంటుందో అనే అసక్తి అందరిలో ఉండేది.

ఆ సినిమాలో ఏ తప్పు వెతుకుదామన్న దొరకని విధంగా తను కథలను రెడీ చేసుకుంటూ వచ్చేవాడు. ఇక ఇప్పుడు కథల విషయంలో చాలామంది రైటర్స్ ని కూర్చోబెడుతున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మాత్రం తేడా కొడుతుంది. ఇక ఎట్టకేలకు ‘కార్తీక్ సుబ్బరాజు’ కథను తీసుకొని చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది…