Homeఎంటర్టైన్మెంట్Venu Swamy-Nayanthara: నయనతారకు తల్లి అయ్యే యోగం లేదు... ఆ ఇద్దరు పిల్లలు ఒక డ్రామా!...

Venu Swamy-Nayanthara: నయనతారకు తల్లి అయ్యే యోగం లేదు… ఆ ఇద్దరు పిల్లలు ఒక డ్రామా! వేణు స్వామి సంచలన కామెంట్స్!

Venu Swamy-Nayanthara: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉంటాడు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సంచలన కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ కి తెరలేపుతాడు. తాజాగా హీరోయిన్ నయనతార పర్సనల్ లైఫ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నయనతార సరోగసి పద్దతిలో పిల్లలు కన్న సంగతి తెలిసిందే. ఆమె సరోగసీని ఆశ్రయించింది అందం కోసం కాదని .. దాని వెనుక అంతకంటే పెద్ద కారణం ఉందని వేణు స్వామి అన్నారు. నయనతార సరోగసి పద్ధతి ఎందుకు ఎంచుకున్నారో అసలు రీజన్ బయటపెట్టాడు.

స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు ఏడేళ్ల పాటు వీరు రిలేషన్ లో ఉన్నారు. 2022లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్ళైన కొన్ని నెలల్లోనే కవలలకు పేరెంట్స్ అవ్వడం చర్చనీయాంశం అయింది. సరోగసి నిబంధలను ఉల్లంఘించారంటూ వారిపై విచారణ కూడా జరిగింది. నయనతార – విఘ్నేష్ శివన్ సరైన ఆధారాలు సమర్పించడంతో వివాదం నుంచి బయట పడ్డారు.

ఇప్పుడు ఇద్దరి పిల్లలతో నయన్ – విఘ్నేష్ శివన్ హ్యాపీ గా ఉన్నారు. అయితే అందం కోసమే నయనతార సరోగసి పద్దతిలో పిల్లల్ని కన్నది అని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అసలు మ్యాటర్ అది కాదు .. అదంతా డ్రామా అంటూ వేణు స్వామి వ్యాఖ్యలు చేసాడు. అసలు నయనతారకు సంతాన యోగం లేదని ఆయన అన్నారు. ఆమెకు సంతాన యోగం లేకనే సరోగసి పద్ధతి ఆశ్రయించిందని ఆయన అన్నారు.

అందం కోసం అంటూ జరిగిన ప్రచారం అంతా వట్టి కట్టుకథ అని వెల్లడించారు. ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మళ్లీ సినిమాలు చేస్తున్నారు. మరి నయనతారకు అలా చేయడానికి సమస్య ఏంటి. అందం కోసం, ఫిజిక్ కోసం పిల్లల్ని కనలేదని అనడం నిజం కాదని ఆయన అన్నారు. చాలా మంది సెలబ్రెటీలు సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారని, బయట ప్రచారం జరిగేదంతా వేరే అని తెలిపారు. అందుకే తాను సంతానానికి సంబంధించిన జ్యోతిష్యం చెప్పడం లేదని వేణు స్వామి వెల్లడించారు.

Exit mobile version