https://oktelugu.com/

Venu Swamy: ప్రభాస్ ఫ్యాన్స్ ని మళ్ళీ గెలికిన వేణు స్వామి… నేను చెప్పిందే జరిగిదంటూ చురకలు!

జాతకాల పేరుతో హీరోలు, రాజకీయ నాయకులపై వేణు స్వామి నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటాడు. నిత్యం కాంట్రవర్సీతో సావాసం చేస్తూ ఉంటాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 19, 2024 / 05:06 PM IST

    Venu Swamy sensational comments on Prabhas

    Follow us on

    Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కొన్నాళ్లుగా సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యాడు. వారి పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి వేణు స్వామి అంచనాలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటాయి. జాతకాల పేరుతో హీరోలు, రాజకీయ నాయకులపై వేణు స్వామి నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటాడు. నిత్యం కాంట్రవర్సీతో సావాసం చేస్తూ ఉంటాడు.

    కాగా గతంలో వేణు స్వామి ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోడని .. ఇక అతని కెరీర్ అయిపోయిందని, బాహుబలి తర్వాత మళ్లీ అంత స్థాయికి ఆయన చేరుకోలేరని వేణు స్వామి అన్నాడు. అంతే కాకుండా సలార్ రిలీజ్ కి ముందు సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పాడు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక కెరీర్ డౌన్ ఫాల్ అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి.

    కానీ సలార్ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వేణు స్వామి కూడా వారిపై కౌంటర్లు వేసాడు. ఇటీవల సలార్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. దీంతో కలెక్షన్స్ వివరాలు కూడా బయట పడ్డాయి. నార్త్ ఇండియా, నైజాం ఏరియా తప్ప మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లు తెలుస్తుంది. బయ్యర్ల నష్టాలను నిర్మాతలు సెటిల్ చేశారట.

    దీంతో వేణు స్వామి తాను గతంలో చెప్పిన మాటలు మళ్లీ తెరపైకి తెచ్చాడు. సలార్ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాను కదా అని అర్థం వచ్చేలా ఓ మీమ్ షేర్ చేశాడు. సలార్ ప్లాప్ అని నేను చెప్తే .. నన్ను కిందా మీదా ఏసుకున్నారు కదరా .. ఇప్పుడేమైంది అంటూ వేణు స్వామి పోస్ట్ పెట్టాడు. దీంతో వేణు స్వామి జాతకమే నిజమైంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోయిన్లు అతనితో పూజలు, హోమాలు చేయించిన సంగతి తెలిసిందే.