https://oktelugu.com/

Raja Saab Movie: రాజాసాబ్ సినిమాలో అసలు ట్విస్ట్ లీక్..ఇలా అయితే కష్టమే…

ఇప్పుడు తెలుస్తున్న విశేషం ఏంటి అంటే రాజాసాబ్ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఒకటి లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్ లు అయితే వస్తున్నాయి.

Written By: , Updated On : April 10, 2024 / 02:07 PM IST
Prabhas Raja Saab Movie Twist Leaked

Prabhas Raja Saab Movie Twist Leaked

Follow us on

Raja Saab Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నారు. ఇక ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాని శాసించేది, కానీ ఇప్పుడు తెలుగు సినిమాలే ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగాయి. అందుకే బాలీవుడ్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఇక మన హీరోలతో అక్కడి దర్శకులు సినిమా చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమా డామినేషన్ అనేది జరుగుతుందని చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రేంజ్ లో రికార్డులన్నింటిని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఒకే ఒక హీరో ప్రభాస్ ప్రస్తుతం ఈయన మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ సినిమా నుంచి అప్పట్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇక అది చూసిన ప్రతి ఒక్కరికి ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది అనే ఒక భావన అయితే కలుగుతుంది.

ఇక ఇప్పుడు తెలుస్తున్న విశేషం ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఒకటి లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్ లు అయితే వస్తున్నాయి. అది ఏంటి అంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ప్రభాస్ తోనే ఉంటూ ప్రభాస్ ని మోసం చేసి తన దగ్గర ఉన్న విలువైన కొన్ని వస్తువులను తీసుకెళ్తుందట. అయితే సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రభాస్ తో ట్రావెల్ చేసిన ఆమె ఎక్కడ కూడా చిన్న డౌట్ రాకుండా హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే చివర్లో ప్రభాస్ ని అలా మోసం చేయడం అనేది మారుతి ట్విస్ట్ గా పెట్టుకున్నాడట.

కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ ట్విస్ట్ అనేది లీక్ అయి సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.ఇక దానివల్ల అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ట్విస్ట్ తెలిసిపోయింది కాబట్టి దాన్ని ఏదైనా మార్చే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రభాస్ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మారుతి మాత్రం ఈ కామెంట్లని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు…