Bigg Boss 7 Telugu: అశ్వినిని టార్చర్ పెడుతున్న ఆ కంటెస్టెంట్… వెళ్ళిపోతా అంటూ ఏడుపులు!

అశ్విని ప్రశాంత్ తో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి ప్రశాంత్ ఈమె ఇలా చేస్తుంది .. నావల్ల కావడం లేదు .. నేను వెళ్ళిపోతా .. పొద్దుపొద్దున్నే మొదలుపెట్టింది. నా జీవితంలో ఇంత తగ్గిపోయి బ్రతికిన సందర్భం లేదు.

Written By: NARESH, Updated On : November 24, 2023 12:17 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అందరికి వండిపెడుతూ పెద్ద వంటలక్క అయిపోయింది ప్రియాంక. కిచెన్ లో గరిటె తిప్పుతూ అందరిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. తాను కాకుండా ఎవరైనా వంట చేస్తే వాటిలో వేలు పెట్టి వంకలు పెడుతుంది. అయితే ప్రియాంక ని ఛాలెంజ్ చేస్తూ ఒంటి చేత్తో వండిపెడతా అంటూ కిచెన్ బాధ్యతలు తీసుకుంది అశ్విని. కాగా గురువారం నాటి లైవ్ ఎపిసోడ్ లో .. అశ్విని కిచెన్ లో వంట చేస్తూ ఉండగా .. ప్రియాంక వెళ్ళింది. అలా చెయ్ ఇలా చెయ్ అంటూ సలహాలు ఇచ్చింది.

కాగా అక్కడ ఏదో క్లాత్ ఉంటే దాన్ని చేత్తో పట్టుకుని అదే చేత్తో వంట చేసిందట అశ్విని. ఇక ప్రియాంక ‘అలా ఎలా చేస్తావ్ .. నేను నీట్ గా లేకపోతే తినలేను అంటూ రచ్చ మొదలు పెట్టింది. దీంతో ‘అమ్మా మహాతల్లి ..నీట్ గా లేక పోతే .. నువ్వే కాదు .. నేను తినలేను .. నాకు తెలియదా . ఆ క్లాత్ నీట్ గానే ఉంది పైగా అది కిచెన్ లో ఉపయోగించే క్లాత్. ఎందుకు సీన్ చేస్తున్నావ్ అని అశ్విని అన్నది. ఇంట్లో అందరికీ చెప్తూ పెద్ద సీన్ చేసింది ప్రియాంక.

దీంతో అశ్విని ప్రశాంత్ తో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి ప్రశాంత్ ఈమె ఇలా చేస్తుంది .. నావల్ల కావడం లేదు .. నేను వెళ్ళిపోతా .. పొద్దుపొద్దున్నే మొదలుపెట్టింది. నా జీవితంలో ఇంత తగ్గిపోయి బ్రతికిన సందర్భం లేదు. నోరు విప్పడం లేదు అని వీళ్ళు ఇంకా ఇంకా కించపరిచి మాట్లాడుతున్నారు. రాత్రి రోటీలు చేశా .. తినడానికి కూర లేక పోయిన సర్దుకున్న. అయినా తప్పు నీదే అని మాట్లాడుతుంది.

చెప్పిన పని చెప్పినట్టు చేసినా .. పదే పదే ఏం చేయలేదని చెప్తుంది. నేను చేసే ప్రతి పనిలో వేలు పెడుతుంది. నేనే తోపు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఎవరూ ఏమీ చేయట్లేదు అన్నట్టుగా సీన్ చేస్తుంది. నేను భరించలేక పోతున్నాను .. కోపం కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను. నన్ను బయటకి పంపిస్తే హ్యాపీ గా వెళ్ళిపోతాను. ఆమె టార్చెర్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.