https://oktelugu.com/

Ram Gopal Varma: మలయాళీ శ్రీదేవి అందానికి రాంగోపాల్ వర్మ ఫిదా.. అడ్రస్ ప్లీజ్ అంటూ రచ్చ.. వైరల్ వీడియో

రీసెంట్ గా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మా. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఈ సారి మెమోరీ అంటూ ఓ పోస్ట్ చేశారు. అయితే ఓ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టును ట్విట్టర్ లో ఉంచుతూ.. ఈ వీడియో చూస్తే నాకు శ్రీదేవి గుర్తుకు వస్తుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 24, 2023 / 12:11 PM IST

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెరకెక్కించే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో కూడా తెలిసిందే. ఒకప్పుడు బోల్డ్ సినిమాల వెనుక పడ్డ వర్మ ఇప్పుడు రాజకీయాల మీద ఫోకస్ చేసినట్టు ఉన్నాడు. ఆయన స్టైలే వేరు, ఆయన విధానమే వేరు అనే విధంగా ప్రవర్తిస్తారు. అంతే కాదు ఎవరికీ భయపడని నైజం, యునిక్ స్టైల్ తో ఏకిపారేస్తుంటారు వర్మ. ఇలాంటి వర్మ మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈయన చేసే పోస్టులు, ట్వీటులు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

    రీసెంట్ గా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మా. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఈ సారి మెమోరీ అంటూ ఓ పోస్ట్ చేశారు. అయితే ఓ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టును ట్విట్టర్ లో ఉంచుతూ.. ఈ వీడియో చూస్తే నాకు శ్రీదేవి గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు శ్రీదేవి రైల్వే స్టేషన్ లో ఇలాంటి షూట్ చేసింది. ఆ సినిమా ఎవరో చెప్పగలరా అంటూ కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతే కాదు ఈ వీడియోలో ఉన్న అమ్మాయి శ్రీదేవిని గుర్తు చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ కు స్పందిస్తున్నారు నెటిజన్లు.

    ఆర్జీవీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీదేవి పాత వీడియోను జోడించి కొందరు రిప్లే ఇస్తే.. ఏకంగా ఆర్జీవీ షేర్ చేసిన వీడియో శ్రీదేవి పాత వీడియో రెండు కూడా ఒకే ఫ్రేమ్ లో ఉంచుతూ రిప్లే ఇచ్చిన వారు కొందరు. అయితే శ్రీదేవి నటించిన ఆ సినిమా హిందీలో సద్మాగా, తెలుగులో వసంత కోకిల సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రైల్వే స్టేషన్ లో శ్రీదేవి అటూ ఇటూ వయ్యారంగా తిరుగుతూ కనిపిస్తుంటుంది. అచ్చం అలాగే ఆర్జీవీ షేర్ చేసిన వీడియో కూడా ఉండడం ఆశ్చర్యం. మొత్తం మీద ఆర్జీవీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సినిమా పేరుతో సహా క్లిప్ కూడా దొరికింది. అయినా ఈ మాస్టర్ చేసే ఏ ట్వీట్ అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.