Ravi Teja: నీకంత సీన్ లేదు అంటూ రవితేజను అవమానించిన నిర్మాత?

కెరీర్ ఆరంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నీకోసం అనే సినిమాతో మొదటి సారిగా హీరోగా మేకప్ వేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్, రవితేజ్ కు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.

Written By: Suresh, Updated On : November 24, 2023 12:27 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటించే సినిమాలు మంచి హిట్ ను సాధిస్తాయి. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే మాస్ మహారాజా బిరుదు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో క్లాసిక్ సినిమాలను కూడా అవలీలగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వివిధ పనులు చేసి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సంపాదించారు. అంతే కాదు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు రవితేజ. ప్రస్తుతం రవితేజ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

కెరీర్ ఆరంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నీకోసం అనే సినిమాతో మొదటి సారిగా హీరోగా మేకప్ వేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్, రవితేజ్ కు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి కమర్షియల్ హీరోగా రాణించారు. అంతేకాకుండా ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అనే సినిమాలు రవితేజకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. కానీ ఇప్పటికే రవితేజ మాత్రం మిడిల్ రేంజ్ హీరోగానే కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఉన్న హీరోలు ఎందరో పాన్ ఇండియా స్టార్లుగా సూపర్ స్టార్లుగా ఎదిగితే.. రవితేజ మాత్రం ఇంకా ఆ స్థాయిని చేరుకోలేకపోతున్నారు అని టాక్.

రీసెంట్ గా వచ్చిన ధమాకా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయారు రవితేజ. అలాంటి రవితేజ హీరోగా ఈ మధ్యకాలంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ హీరో నటించే నెక్ట్స్ సినిమాపైనే అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ నిర్మాత రవితేజ గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మాస్ రాజా గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపించింది. అయితే వీరి కాంబినేషన్ లో ఇప్పటికే బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకు అన్ని కలుపుకొని రూ. 120 కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం.

భారీ బడ్జెట్ పెట్టడం కష్టమని.. దీంతో రవితేజను రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కోరారట నిర్మాత. కానీ ఈ విషయంలో రవితేజ తగ్గలేదట. దీంతో నిర్మాత నవీన్ ఎర్నేని ఇండస్ట్రీలో నీకున్న మార్కెట్ కు ఇదే ఎక్కువ. నీకు అంత సీన్ లేదు.. అయినా నీ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టి తెరకెక్కించలేం అని ఘాటుగా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఈ ఘాటు వ్యాఖ్యల వల్ల సినిమా క్యాన్సల్ అయిందని టాక్. ప్రస్తుతం ఈ టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి దీనిపై ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తారో లేదో అనేది…