AS RaviKumar Choudhary Passes away: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు అయిన ‘ఏ ఎస్ రవికుమార్ చౌదరి’ (A S Ravi Kumar Choudhary) కార్డియాక్ అరెస్ట్ కారణం చేత మరణించారు… జూన్ 10వ తేదీ అర్ధరాత్రి ఆయన మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. కెరియర్ మొదట్లో గోపీచంద్ తో యజ్ఞం (Yagnam) లాంటి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత బాలయ్య బాబు(Balayya Babu) తో వీరభద్ర (Veerabhadra) అనే సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ ని సాధించకపోయిన కూడా దర్శకుడిగా అతనికి మంచి గుర్తింపు అయితే అందించింది… సినిమా ఇండస్ట్రీలో హిట్టు, ఫ్లాప్ అనేది కామన్ గా వస్తూనే ఉంటాయి. వాటన్నింటికి తట్టుకొని సక్సెస్ లను సాధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవీ సక్సెస్ లను సాధించడం లేదు. సాయిధరమ్ తేజ్ తో చేసిన ‘పిల్ల నువ్వు లేని జీవితం’ (pilla Nuvvu Leni Jeevitham) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక రీసెంట్ గా ఆయన రాజ్ తరుణ్ తో చేసిన ‘తిరగబడరా స్వామి’ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
Also Read: Duvvada Srinivas And Madhuri Dance: దువ్వాడ-దివ్వెల.. మరీ ఇంత ఓపెన్ అయిపోయారేంటి.. వైరల్ వీడియో!
దాంతో ఆయన గత కొన్ని రోజుల నుంచి తన కుటుంబానికి చాలా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక చుట్టూ ఉండే ఫ్యామిలీ దూరంగా ఉండటం, అతని సన్నిహితులు సైతం అతనికి దూరం కావడంతో తీవ్రమైన మనస్థాపానికి గురైన ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆయన హాస్పటల్లో చేరినప్పటికి ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది.
మరి ఏది ఏమైనా కూడా మంచి సినిమాలను చేసి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం… ఆయన మరణం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటనే చెప్పాలి.
Also Read: Akhanda 2 Release Date: అఖండ 2′ విడుదల తేదీ వాయిదా..? నందమూరి అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్!
ముఖ్యంగా గోపీచంద్ (Gopi Chand) తో చేసిన యజ్ఞం సినిమా అయితే అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాతోనే బాలయ్య బాబు పిలిచి మరి వీరభద్ర సినిమా చేసే అవకాశం అయితే ఇచ్చాడు. అలాంటి ఒక మంచి మేకర్ ను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం…