Arya 2
Arya 2 : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం తో మొట్టమొదటి సారి టాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న అల్లు అర్జున్, ‘పుష్ప’ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు. పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప 2′(Pushpa 2) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ కి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొత్తం అల్లు అర్జున్ అభిమానులు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లలను ఈ స్థాయిలో ప్రభావితం చేశాడు. మళ్ళీ ఆ రేంజ్ లో ఏ హీరో కూడా చేయలేదు. ఆయన తర్వాత అలాంటి అదృష్టం అల్లు అర్జున్ కి మాత్రమే దక్కింది.
Also Read : రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్న అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లోకి ‘ఆర్య 2’
అయితే ఇప్పుడు ఆయన తన ఫాలోయింగ్ ఎలాంటిదో మరోసారి నిరూపించుకునే అవకాశం దక్కింది. కొత్త సినిమాలకు మంచి హైప్ ఉంటే హిట్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ రీ రిలీజ్ సినిమాలతో రికార్డ్స్ కొట్టాలంటే కచ్చితంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. అది అల్లు అర్జున్ కి ఉందా లేదా అనేది ఇప్పుడు నిరూపితం కాబోతుంది. ఇప్పటి వరకు ఆయన హీరో గా నటించిన పాత సినిమాలలో ‘దేశముదురు’ ఒక్కటే రీ రిలీజ్ అయ్యింది. ఈ రీ రిలీజ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో రీ రిలీజ్ ట్రెండ్ తారా స్థాయిలో ఉండేది, ఇప్పుడు ఆ రేంజ్ లేదు. ఈ సమయంలో రికార్డ్స్ క్రియేట్ చేయడం కష్టం. ఏప్రిల్ 7 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్య 2′(Aarya 2 Re Release) చిత్రాన్ని ఏప్రిల్ 5న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిన అంశం.
రీసెంట్ గానే విడుదలైన రీ రిలీజ్ చిత్రాలలో రామ్ చరణ్(Global Star Ram Charan) ఆరెంజ్, ప్రభాస్(Rebel Star Prabhas) ‘సలార్’, మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చిత్రాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చాయి. కానీ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదలైన ‘నాయక్’ చిత్రానికి మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సక్సెస్ అవుతుందా లేదా అని విశ్లేషకులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే రీ రిలీజ్ చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ సాంగ్స్ కచ్చితంగా ఉండాలి. ‘ఆర్య 2’ లోని పాటలు ఆరోజుల్లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా పాటల వల్ల సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.
Also Read : ఒక క్లాసికల్ హిట్ గా నిలవాల్సిన ఆర్య 2 ప్లాప్ అవ్వడం వెనక కారణం ఇదే…