Arya 2
Arya 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక వైవిధ్యమైన సైనిమా అనే చెప్పాలి.నిజానికి ఈయన సినిమాల్లో చాలా మైన్యుర్ డీటెయిల్స్ ని కూడా చాలా అద్భుతంగా చూపిస్తూ ఆయన సినిమా మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రతి సినిమాలో చూపిస్తూ ఉంటాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఆర్య 2 సినిమాలో ఆయన అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఒక సైకో టైప్ ఆఫ్ పాత్ర లో ఉన్నట్టు గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఆర్య కి ఆ సినిమాలో ఎవ్వరితో పని లేదు ఆయన కి అజయ్, గీత ఇద్దరు బాగుంటే చాలు అనుకునే క్యారెక్టర్ కాబట్టి వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేడు అందుకే ఆర్య చివర్లో వాళ్ళని కలపడానికి తన ప్రాణం కూడా కోల్పోవడానికి రెఢీ అవుతాడు…
ఇక ఇలాంటి ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులకి నచ్చలేదు అంటే ఆర్య అనే క్యారెక్టర్ అప్పుడప్పుడు నెగిటివ్ టచ్ లో ఉంటుంది అలాగే అన్ని ఓపెన్ గా అందరితో పంచుకున్న కూడా ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడూ ఎలా బిహేవ్ చేస్తుందో ఎవ్వరికీ తెలీదు కాబట్టి ఆ క్యారెక్టర్ కి జనాలు చాలా వరకు కనెక్ట్ కాలేకపోయారు.ఇక దానికి తోడు గా ఒక క్యారెక్టర్ అనేది సినిమా చూసే జనాలకి మైండ్ లోకి ఎక్కేసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఒక ప్రాబ్లం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడో ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ క్యారెక్టర్ అనేది ప్రతి సారి ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు కాబట్టి ఆ క్యారెక్టర్ కి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఇది జనాలకి పెద్దగా నచ్చలేదు. అదే సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాను చూసుకుంటే చిట్టిబాబు పాత్ర మనకు చాలా దగ్గరవుతోంది…
కానీ ఆర్య 2 మూవీ లో ఆ క్యారెక్టర్ బిల్డ్ అనేది సరిగా ఉండదు. దాని వల్లనే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అది ఒక్కటి మినహా ఇస్తే ఈ సినిమా మాత్రం ఇప్పుడు చూసిన కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది…ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక డిఫరెంట్ అనుభూతిని పొందుతాడు అని అయితే చెప్పవచ్చు అందుకే కొత్తగా డైరెక్టర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా ని విపరీతంగా చూస్తూ ఉంటారు…