Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu : హీరోయిన్ గా సమంత(Samantha Ruth Prabhu) సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు, ప్రతీ వయస్సుకి సంబంధించిన ఆడియన్స్ కి అభిమాన నటి. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా కూడా సమంత అని ఆరాధించే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కేవలం సౌత్ ఇండియా కి మాత్రమే పరిమితం కాకుండా, నార్త్ ఇండియా లో కూడా బాగా పాపులర్ అయ్యి, అక్కడ దశాబ్దాలుగా నాటుకుపోయిన స్టార్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టింది. అంతటి సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సమంత, అనారోగ్యం కారణంగా చాలా కాలం నుండి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.
Also Read : హీరోయిన్ సమంత కి గుడి కట్టిన వీరాభిమాని..వైరల్ అవుతున్న వీడియో!
రీ ఎంట్రీ తర్వాత కేవలం ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మాత్రమే కాదు, నిర్మాతగా కూడా మారింది. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్'(Tralala Moving Pictures) ని స్థాపించిన సమంత, కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే మంచి ఉద్దేశ్యంతో ‘శుభం'(Subham Movie Teaser) అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నిన్ననే విడుదల చేసారు. ఈ టీజర్ ని చూస్తే ఒక హారర్ థ్రిల్లర్ అనే విషయం అర్థం అవుతుంది. హీరో, హీరోయిన్లు కొత్త పెళ్లి చేసుకొని శోభనం గదిలోకి అడుగుపెడతారు. వీళ్లిద్దరి సంభాషణ ని చూస్తే హీరో ఎంత అమాయకుడు అనే విషయం అర్థం అవుతుంది. ఈలోపు హీరోయిన్ లో అకస్మాత్తుగా ఒక మార్పుని గమనిస్తాడు హీరో. ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో క్రిందకు వెళ్లి కూర్చొని టీవీ ఆన్ చేసి తనకు ఇష్టమైన సీరియల్ ని చూస్తూ ఉంటుంది. జీవితం లో మనకి ఎంతో ముఖ్యమైన ఘట్టం ఇది , ఇలాంటి సమయంలో సీరియల్ చూడడం ఏమిటి? అని హీరో అడుగుతాడు.
అప్పుడు హీరోయిన్ కోపం తో ‘ఉష్’ అని సైగ చేస్తుంది. ఆ తర్వాత హీరో కి అర్థం అవుతుంది, ఆమెలో దెయ్యం దూరింది అని. ఒక అమాయకమైన కుర్రాడు, దెయ్యం సోకిన భార్యతో ఎలాంటి జీవితం గడిపాడు అనేదే కథ. కాస్త కొత్తగా ఉంది కదూ. హారర్ కామెడీ జానర్ లో వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కానీ ఇలా కొత్తదనం చూపించే సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తాయి. ‘శుభం’ కూడా అలాంటి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాగుంటే, పెద్ద హీరోలతో సమానంగా వసూళ్లు వస్తున్నాయి. బడ్జెట్ కేవలం కోటి నుండి రెండు కోట్ల రూపాయిలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ వసూళ్లు మాత్రం వంద కోట్ల రేంజ్ లో ఉంటున్నాయి. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే సమంత కుంభస్థలం బద్దలు కొట్టినట్టే అనుకోవచ్చు.
Also Read : రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న సమంత..? ఆధారాలతో సహా దొరికేసిందిగా!