https://oktelugu.com/

Arya 2 : రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్న అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లోకి ‘ఆర్య 2’

Arya 2 : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను సరికొత్త టెక్నాలజీ కి మార్చి, మన అభిమాన థియేటర్స్ లో మరోసారి విడుదల చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : March 14, 2025 / 02:02 PM IST
    Arya 2

    Arya 2

    Follow us on

    Arya 2 : టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను సరికొత్త టెక్నాలజీ కి మార్చి, మన అభిమాన థియేటర్స్ లో మరోసారి విడుదల చేస్తున్నారు. పోకిరి చిత్రం నుండి ఈ ట్రెండ్ మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన తర్వాత, జల్సా చిత్రం తో ఈ ట్రెండ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఇక అప్పటి నుండి స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపిస్తున్నాయి. ఈ రీ రిలీజ్ రికార్డ్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) వంటి హీరోలకే ఉన్నాయి. రీసెంట్ గానే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం కూడా రీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది.

    Also Read : ఒక క్లాసికల్ హిట్ గా నిలవాల్సిన ఆర్య 2 ప్లాప్ అవ్వడం వెనక కారణం ఇదే…

    నిన్ననే ప్రభాస్(Rebelstar Prabhas) ‘సలార్'(Salaar Re Release) మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాతో ప్రభాస్ కూడా రీ రిలీజ్ ట్రెండ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు. ఆ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం. కానీ త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘ఆర్య 2′(Aarya 2 Movie) పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. అప్పట్లో మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఒక సెన్సేషన్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ అయితే ఆ రోజుల్లో నేషనల్ వైడ్ గా గుర్తింపు ని తెచ్చుకున్నాయి. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి.

    ‘ఆరెంజ్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ సినిమాకు రీ రిలీజ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ వచ్చాయి. ‘ఆర్య 2’ కూడా ఒకప్పుడు కమర్షియల్ గా ఫ్లాప్ అనిపించుకున్న సినిమానే. కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ పెరిగింది. అందుకే మేకర్స్ ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో డబ్ చేసి అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. సరిగ్గా వర్కౌట్ అయితే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. చూడాలి మరి ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.

    Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో 5 మంది హీరోయిన్లు, ఇద్దరు హీరోలు..అసలు ఇదేమి ప్లానింగ్ బాబోయ్!