‘L2 : గత కొంతకాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న ప్రముఖ హీరో మోహన్ లాల్(Mohanlal), ఇప్పుడు మన ముందుకు ‘L2: ఎంపురాన్'(L2: Empuraan) చిత్రం తో వచ్చాడు. ‘లూసిఫర్'(Lucifer Movie) లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ కావడంతో మొదటి నుండి ఈ చిత్రం పై ఉండే అంచనాలు వేరే. అంతే కాదు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో కనివిని ఎరుగని భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కూడా ఇదే. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఈ కాలం లో చాలా తక్కువ కదా అని మీరంతా అనుకోవచ్చు. అది తమిళం, తెలుగు సినీ ఇండస్ట్రీ లకు తక్కువే, కానీ మలయాళం సినీ ఇండస్ట్రీ కి చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్లకు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు రావడమే కష్టం.
Also Read : ఎంపురాన్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇదేమి రచ్చ!
అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. టాక్ పెద్దగా లేదు కాబట్టి వసూళ్లు కూడా పెద్దగా ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. వంద కోట్ల గ్రాస్ ఫుల్ రన్ లో వస్తే ఇండస్ట్రీ హిట్ గా భావించే మలయాళం ట్రేడ్ పండితులకు, ఈ సినిమా మొదటి రోజే 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. రెండవ రోజు 31 కోట్లు, మూడవ రోజు 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజుల్లో 136 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 64 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నిన్న ఉగాది పర్వదినం కావడం తో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
అలా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి దాదాపుగా 176 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. నేడు, రేపటి తో ఆ మార్కుని అవలీలగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తుంది అనే చెప్పాలి. నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ఊపు ని ఈ వారం మొత్తం కొనసాగిస్తే కచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2 Movie) గ్రాస్ వసూళ్లు అవలీల గా బ్రేక్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’