Homeఎంటర్టైన్మెంట్Arun S/o Vyjayanthi : అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ లుక్: రాములమ్మ ఈజ్...

Arun S/o Vyjayanthi : అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ లుక్: రాములమ్మ ఈజ్ బ్యాక్, మైండ్ బ్లాక్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కొత్త మూవీ పోస్టర్!

Arun S/o Vyjayanthi : తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన నటి విజయశాంతి. తెలంగాణకు చెందిన విజయశాంతి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే బిరుదులు సొంతం చేసుకుంది. 90లలో హీరోలకు సమానమైన స్టార్డం అనుభవించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె నెలకొల్పిన రికార్డులు మరొక హీరోయిన్ చేరుకోలేనివి. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మా వంటి చిత్రాలు ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా విజయశాంతి నిలిచింది.

Also Read : బన్నీ పక్కన పెట్టాడు.. ప్రభాస్ కి గాలం వేస్తున్న త్రివిక్రమ్… సెట్ చేసే పనిలో ఆ స్టార్ ప్రొడ్యూసర్

దశాబ్దాల అనంతరం విజయశాంతి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో కళ్యాణ్ రామ్ 21వ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకుని విడుదల చేశారు. లేడీ గెటప్ లో విజయశాంతి ఆ రోజులు గుర్తు చేశారు. ఆమె లుక్ అద్భుతంగా ఉంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తల్లి కొడుకులుగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటిస్తున్నారని అర్థం అవుతుంది.

టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో భారీ హైప్ నెలకొంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బిగ్గెస్ట్ ఓపెనర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో భారీ క్యాస్ట్ నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ కి చెందిన సోహైల్ ఖాన్, అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీలో ఓ కీలక రోల్ చేసిన విజయశాంతి మరలా గ్యాప్ తీసుకుంది. పాత్ర నచ్చడంతో కళ్యాణ్ రామ్ మూవీలో నటించేందుకు పచ్చజెండా ఊపింది. రాజకీయంగా విజయశాంతి సక్సెస్ కాలేదు. నటిగా ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయశాంతి ఇకపై వరుసగా చిత్రాలు చేస్తారని టాక్. చూడాలి రాములమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..

Also Read : ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకుంటున్న కియారా అద్వానీ..నిర్మాతలకు కోట్లలో నష్టం..అకస్మాత్తుగా ఏమైంది?

RELATED ARTICLES

Most Popular