Women Baying Car : మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నారు. నేటి కాలంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలు పెరిగిపోతుండడంతో వారి అవసరాలు తీర్చడానికి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో వారు ప్రయాణాలు చేయడానికి సొంతంగా వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు మహిళలు స్కూటర్ల పైనే ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కానీ నేటి కాలంలో మహిళలు ఎక్కువగా కార్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అనుకూలంగా ఉండే చిన్న కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల తేలిన కొన్ని లెక్కల ప్రకారం మొత్తం కార్ల అమ్మకాలలో మహిళల కొనుగోలు శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా సిటీలో ఉండే వారు ఎక్కువగా ఫోర్ వీలర్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే..
Also Read : ఫ్యామిలీకి అనుగుణంగా రాబోతున్న మూడు కార్లు.. వీటి గురించి తెలుసా?
మహిళలు అనగానే వంటింటికి లేదా ఇంటికి మాత్రమే పరిమితమయ్యే రోజులు పోతున్నాయి. నేటి కాలంలో చాలామంది మహిళలు ఫీల్డ్ వర్క్ చేయడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నారు. దీంతో వారు కూడా పురుషుల్లాగే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే పురుషులతో సమానంగా వారు వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. ఒకప్పుడు స్కూటర్ పై మహిళా కనిపిస్తే విచిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఎయిర్ పైలట్ గా రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తమ సొంత అవసరాలకు కార్లను కొనుగోలు చేస్తున్నారు.
తాజాగా తేలిన ఓ లెక్కలు ప్రకారం.. ప్రతి ఏటా మహిళలు కార్లు కొనుగోలు చేయడం పెరిగిపోతుంది. 2013లో మొత్తం కార్ల అమ్మకాలలో మహిళలు 16% గా కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2024లో 26 శాతానికి పెరిగింది. 2025 ఫిబ్రవరి వరకు 46 శాతానికి చేరుకోవడం చూస్తే.. వారు ఏ విధంగా కార్లు కొనుగోలు చేస్తున్నారో అర్థం అవుతుంది. ఈ కార్లలో ఎక్కువగా 60 శాతం మంది ఆటోమేటిక్ కార్ల పైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొదటిసారి కారు కొనుగోలు చేసిన సమయంలో డ్రైవ్ పూర్తిగా రావడానికి ఆటోమేటిక్ కార్లను ఎ క్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే 18 శాతం మంది మహిళలు కాంపాక్ట్ ఎస్ యు విలను కోరుకుంటున్నట్లు తేలింది
మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్, హుందాయి గ్రాండ్ ఐ10, రెనాల్ట్ క్విడ్ వంటివి ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఎక్కువగా కార్లను మహిళలు కొనుగోలు చేశారు. ఇక్కడ అత్యధికంగా 48 శాతం కారులను కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ తర్వాత ముంబై బెంగళూరు పూణే వంటి నగరాల్లో కారులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వారే ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నట్లు తేలుతోంది. వీరు ఉద్యోగం లేదా కుటుంబం నడిపే వారు తమ సొంత అవసరాలకు కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే నేటి కాలంలో విద్యుత్ కార్లు ఎక్కువగా రావడంతో ఇంటిపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా వచ్చే కాళ్లు స్మూత్ డ్రైవ్ ఉండడంతో వీటిని కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.