Viral Video : బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో బ్రాయిలర్ చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కోడిగుడ్డ ధరలు కూడా నేల ముఖం చూస్తున్నాయి. ఇలాంటి క్రమంలో చేపలు, రొయ్యలు, మటన్, పిట్టల విక్రయాలు పెరిగాయి. సహజంగా తెలుగు రాష్ట్రాలలో కిలో మటన్ ను 800 కు విక్రయిస్తుంటారు. అయితే బర్డ్ ఫ్లూ వల్ల మటన్ ధర అమాంతం పెరిగింది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు కిలోకు వంద పెంచి 900 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక చేపల ధర కూడా భారీగానే ఉంది. గతంలో కిలో చేపల ధర 120 రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 150 రూపాయలకు పెరిగింది. ఇక రొయ్యల ధర కూడా గతంలో 250 ఉండగా.. ఇప్పుడు 350 వరకు పలుకుతోంది. టైగర్ రొయ్యల ధర అయితే ఏకంగా 500కు చేరుకుంది. హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో రొయ్యల ధర ఆదివారమైతే 600 పలుకుతోంది. గతంలో కౌజు పిట్టలు జత 250 ఉండగా.. ఇప్పుడు వాటి ధర 350 కి చేరుకుంది. బ్రాయిలర్ విక్రయాలు పడిపోవడంతో.. మిగతా మాంసాలకు డిమాండ్ పెరిగింది. వినియోదారులు మటన్, చేపలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : మల బద్దకాన్ని ఇంత క్రియేటివ్ గా చెప్పొచ్చా.. వైరల్ హోర్డింగ్
మోసం చేస్తున్నారు
బర్డ్ ఫ్లూ వల్ల మటన్, చేపలకు డిమాండ్ పెరిగిందని చెప్పుకున్నాం కదా.. అయితే మటన్ కు అంత ధరపెట్టి కొనుగోలు చేరిని వారు.. చేపలను కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేపలు విరిగిగానే లభిస్తాయి. ధర కూడా 200ల లోపే ఉంటుంది. కొర్రమీను, బొమ్మిడాయిలు వంటి చేపలు మినహాయిస్తే మిగతా వాటి ధర సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది . బర్డ్ ఫ్లూ వల్ల చేపలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కొంతమంది ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా చేపలు ఫ్రెష్షో, కాదో తెలుసుకోవడానికి వాటి మొప్పలను పరిశీలిస్తారు. అవి ఎరుపుగా ఉంటే తాజాగా ఉన్నాయని.. లేకుంటే ఎప్పుడో పట్టినవని భావిస్తారు. ప్రస్తుతం చేపలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వినియోదారులను మోసం చేయడానికి కొంతమంది కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎప్పుడో పట్టిన చేపలు అయినప్పటికీ.. వాటి మొప్పలకు ఎరుపు రంగు వేస్తున్నారు. తద్వారా అవి తాజాగా ఉన్నాయనే భ్రమ కల్పిస్తున్నారు. మొప్పలకు ఎరుపు రంగు వేశారని తెలియక.. అవి ఎర్రగా ఉన్నాయని భావించిన వినియోదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా వినియోగదారులను మోసం చేస్తున్న కొంతమంది నిర్వాకం ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో కొంతమంది వ్యాపారులు చేపల మొప్పలకు ఎరుపు రంగు వేస్తూ కనిపించారు. దీన్ని చూసిన నెటిజన్లు ఈ తరహా మోసం ఇటీవల కాలంలో చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఛార్జింగ్ అయిపోవడంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి స్కూటర్ తోసుకెళ్లిన వ్యక్తి..వీడియో వైరల్
View this post on Instagram