Kiara Advani : పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ(Kiara Advani). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) హీరో గా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు లో ఆమెకి ఆఫర్స్ క్యూలు కట్టాయి. కానీ ఆమె ఎక్కువ గా బాలీవుడ్ వైపే తన ఫోకస్ ని పెట్టింది. ‘భరత్ అనే నేను’ తర్వాత తెలుగు లో ఆమె రామ్ చరణ్(Global Star Ram Charan) తో కలిసి ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్’ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్న కియారా అద్వానీ రామ్ చరణ్ కి మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
Also Read : తల్లి కాబోతున్న ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కియారా అద్వానీ కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ‘టాక్సిక్’, బాలీవుడ్ లో ‘వార్ 2 ‘, ‘డాన్ 3’ వంటి చిత్రాలు చేస్తుంది. వీటిల్లో ‘వార్ 2’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే. కానీ మిగిలిన రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ‘టాక్సిక్’ చిత్రం లో కియారా అద్వానీ కి సంబంధించి చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. అదే విధంగా ‘డాన్ 3 ‘ మూవీ షూటింగ్ లో కూడా ఒక షెడ్యూల్ లో పాల్గొన్నది. అయితే ఇప్పుడు ఆమె ‘డాన్ 3’ చిత్రం నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ‘టాక్సిక్’ నుండి ఆమె తప్పుకున్నట్టు శాండిల్ వుడ్ లో వినిపిస్తున్న ఒక రూమర్.
కారణం ఆమె గర్భం దాల్చడం వల్లే. ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో త్వరలోనే తల్లిని కాబోతున్నట్టు అభిమానులకు ఆనందంతో ఒక వార్తని పంచుకుంది. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి అవసరం అని అన్నందున ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాల నుండి వరుసగా తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తల్లి అయిన తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే బాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్స్ బిడ్డలకు జన్మలను ఇచ్చిన తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు. అలియా భట్ కూడా అంతే. రాహా పుట్టకముందు ఆమె వరుస సినిమాలతో ఎంత బిజీ గా ఉండేదో మన అందరికీ తెలిసిందే. కానీ రాహా పుట్టిన తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. కియారా కూడా అదే దారిలో నడవనుందా?, లేదా సినిమాలను కొనసాగిస్తుందా అనేది చూడాలి.
Also Read : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్