Maharaj: అసలేంటి నెట్ ఫ్లిక్స్ ‘మహరాజ్’ సినిమా.. కథేంటి? ఎందుకు వివాదమైంది?

సనాతన హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ సినిమాను బహిష్కరించాలి అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో 1862 నాటి పరువు నష్టం కేసు ఆధారంగా సినిమాను తెరకెక్కించారట.

Written By: Swathi Chilukuri, Updated On : June 22, 2024 1:02 pm

Maharaj

Follow us on

Maharaj: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తొలిసారి మహారాజ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా రీసెంట్ గా అంటే జూన్ 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సినిమా చూసినా చాలా మంది బాయికాట్ నెట్ ఫ్లిక్స్ బ్యాన్ మహారాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేశారు. అసలు ఈ సినిమా కథేంటి? ఎందుకు దీని మీద తీవ్ర దుమారం రేగింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సనాతన హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ సినిమాను బహిష్కరించాలి అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో 1862 నాటి పరువు నష్టం కేసు ఆధారంగా సినిమాను తెరకెక్కించారట. అప్పుడు బ్రిటీష్ న్యాయ వ్యవస్థ, భారతీయ సనాతన ధర్మం, హిందూ పవిత్ర గ్రంథాలు, మంత్రాలను పక్షపాతంతో తప్పు అన్వయించారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 200 సంవత్సరాల క్రితం నాటి కుట్ర కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని వాదన.

ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రయత్నమే ఈ సినిమా అనే వాదనలు కూడా ఉన్నాయి. సమాజాన్ని తప్పుదారి పట్టించే కంటెంట్ వల్ల తీవ్ర ప్రభావం ఉంటుందని మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ సినిమా గుజరాత్‌ సహా భారతదేశం, సనాతన ధర్మం భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు. మీడియాలోని తప్పుడు వర్ణనలు ప్రజలు సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు అపోహలు, పక్షపాతాలకు దారి తీస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి.

మహిళల మీద చూపించిన లైంగిక చర్యలు, కుల మతాలు, వంటివి ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలని వీటి వల్ల సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమా మీద కోర్టులో కేసు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద అమీర్ ఖాన్ కుమారుడు హీరోగా వచ్చిన ఫస్ట్ సినిమానే ఇలా వివాదం అవడంతో అమీర్ ఖాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.