Gold: ప్రస్తుతం బంగారం హవా కొనసాగుతోంది. రోజురోజుకు వీటి ధరలు పెరగడమేకానీ తగ్గడం లేదు. బంగారం పెరగడంతో ఒక వైపు కొనుగోలుదారుల్లో కాస్త నిరాశ కలిగినా..ఇన్వెస్ట్ మెంట్ చేసేవారికి ఇది లాభమే అంటున్నారు. అయితే కొందరు ఇదే సమయంలో ధరలతో సంబంధం లేకుండా ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారంనకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొందరు ఫేక్ గోల్డ్ ను సృష్టించి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. దీనిని అచ్చం మేలైన బంగారం లా తయారు చేసి కొనుగోలుదారులకు అనుమానం రాకుండా చేస్తున్నారు. అయితే బంగారం నిజమైందో.. నకిలీదో ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. అదెలాగంటే?
బంగారం నిజమైందో, నకిలీదో గుర్తించడానికి పలు మార్గాలు ఉన్నాయి. జువెల్లరీ షాపు లో కొనగోలు చేసిన బంగారం ఆభరం అయితే దీనిపై BJS Mark ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది త్రిబుజాకారాన్ని పోలి ఉంటుంది. అలాగే ఈ ఆభరణంపై Purity Chart కు సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది. ఇది ఆరు అంకెలను కలిగి ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లెటర్స్ కూడా ఉంటాయి. ఇక HUIDఅనే నెంబర్ ఉందో? లేదో? చూసుకోవాలి. ఇది ప్రత్యేకంగా ఆభరణం కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా ఉంటుంది.
అయితే ఇక్కడి వరకు మాన్యువల్ గా చెక్ చేసుకుంటారు. అందువల్ల కొందరు ఫేక్ బంగారం తయారు చేసేవాళ్లు ఇవన్నీ ముద్రిస్తారు. అయితే ఈ బంగారం అసలైందో? నకిలీదో తెలుసుకోవడానికి ఓ యాప్ ఉంది. ఇందులో వీటికి సంబంధించిన నెంబర్లను ఎంట్రీ చేస్తే అది ఫేకో, రియలో తెలిసిపోతుంది. ఈ యాప్ పేరు BIS Care App. దీనిని గూగుల్ ప్లే నుంచి డౌన్ లోడ్ చేసుకున్న తరువాత ఓపెన్ చేయాలి.
ముందుగా ఇక్కడ బంగారం ఆభరణం సింబల్ కలిగి Verify HUID అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో బంగారం ఆభరణంపై ఉన్న HUID నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఇది ఎంట్రీ చేసిన తరువాత జువెల్లరీ షాప్ లో కొనుగోలు చేసిన బంగారం ఆభరణానికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు దీనిని ఎవరు కొనుగోలు చేశారో.. దానికి సంబంధించిన బిల్లు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు బిల్లుకు సమానంగా ఆ రిసిప్ట్ వస్తే అది రియల్ గోల్డ్. లేకపోతే అది ఫేక్ అని గుర్తించాలి.