https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్ సెంటిమెంట్ సినిమాలకి కాలం చెల్లిందా..?

Venkatesh: ఒకానొక సమయంలో వెంకటేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ అభిమానులందరూ థియేటర్ కి వెళ్లి మరి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 / 10:17 AM IST

    Venkatesh sentimental movies are outdated

    Follow us on

    Venkatesh: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో టైప్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలను తీయడంలో శోభన్ బాబు(Shoban Babu) చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఫ్యామిలీ అభిమానులైతే శోభన్ బాబు సినిమా కోసం అమితంగా ఎదురుచూసేవారు. ఇక ఆయన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను తీయడంలో వెంకటేష్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఒకానొక సమయంలో వెంకటేష్ నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ అభిమానులందరూ థియేటర్ కి వెళ్లి మరి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. ఆ రకంగా కొన్ని సినిమాలను వెంకటేష్ మాత్రమే చేయగలడు అనేంతలా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లాంటి హీరో సైతం తను చేసిన డాడీ సినిమాని వెంకటేష్ చేసుంటే సూపర్ సక్సెస్ అయి ఉండేది అంటూ ఓపెన్ గా చెప్పాడు. అంటే ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు.

    Also Read: Ram Charan: బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామ్ చరణ్…

    ఇక వెంకటేష్ చేసిన సూర్యవంశం(suryavamsam), రాజా(Raja), వసంతం, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన్ని స్టార్ హీరోగా మార్చడంలో కూడా చాలావరకు సహాయపడ్డాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి మాత్రం వెంకటేష్ కి ఫ్యామిలీ సబ్జెక్టులు అసలు కలిసి రావడం లేదు. సైంధవ్ సినిమాతో కూతురు సెంటిమెంట్ ను వర్కౌట్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.

    Also Read: Dhee Judge: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఢీ జడ్జ్… ఆ నురగ కరిగిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్!

    మరి ఇప్పుడు ఆయన మరోసారి ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? లేదంటే డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడా? అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన ఎలాంటి వివరణ సినిమా యూనిట్ ఇంకా రాలేదు. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…