https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన స్టార్ డైరెక్టర్స్ వీళ్లేనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే మనవాళ్లు మంచి సబ్జెక్టులతో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 1, 2024 / 08:48 AM IST
    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటికి కూడా చాలామంది స్టార్ హీరోలకు సైతం ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక సినిమాకి కమిట్ అయితే సినిమా పూర్తి అయ్యేంతవరకు ఆ సినిమా కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అందువల్లే చిరంజీవి పేరు చెబితే చాలు యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకు గౌరవాన్ని ఇస్తారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా భారీ గ్రాఫికల్ ఎఫెక్ట్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం భారీగా డబ్బులను కూడా ఖర్చు చేస్తున్నారట. ఇక నిజానికి చిరంజీవి టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలను ఇస్తూ ఉంటాడు. అదే విధంగా ఆయన అవకాశాలు ఇచ్చిన కొంతమంది దర్శకులు మాత్రం ఆయనకు సక్సెస్ ని ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఎవరు అంటే…

    వెంకీ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న శ్రీను వైట్లకు చిరంజీవి ‘అందరివాడు’ సినిమా చేసే అవకాశం అందించాడు. అయితే శ్రీను వైట్ల తీసిన ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సినిమా మాత్రం కమర్షియల్ గా ప్రేక్షకులను ఆలరించలేక పోయింది. సగటు ప్రేక్షకుడిని మెప్పించడంలో ఈ సినిమా చాలావరకు ఢీలా పడిపోయింది…

    సినిమా కెరియర్ లో చాలామంది దర్శకులు మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేసిన మెహర్ రమేష్ మాత్రం భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. ఇక ఆయన ఖాళీగా ఉంటున్నాడనే ఉద్దేశ్యంతో చిరంజీవి అతన్ని పిలిచి తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ‘వేదలం ‘ సినిమాని రీమేక్ చేసే అవకాశాన్ని అందించాడు. ఇక దాంతో ‘భోళా శంకర్ ‘ పేరుతో ఆ సినిమాను రీమేక్ చేశాడు. తద్వారా చిరంజీవికి కూడా ఒక మంచి సక్సెస్ అయితే వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ చిరంజీవికి భారీ డిజాస్టర్ ని అందించడంతో చిరంజీవి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా కోలుకోవాలని దెబ్బ కొట్టిందనే చెప్పాలి…

    ఇక కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో చిరంజీవికి సక్సెస్ ని ఇవ్వలేకపోయాడ. కారణం ఏదైనా కూడా ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మారడం అటు కొరటాలకు , ఇటు చిరంజీవికి చాలా వరకు మైనస్ అయింది…