https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అసలు మణికంఠకి జనాలు ఎలా ఓట్లు వేస్తున్నారు..వాడు ఫేక్ అంటూ నిఖిల్ ముందు యష్మీ అసహనం!

నిఖిల్, పృథ్వీ తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యష్మీ నిఖిల్ తో మాట్లాడుతూ 'ఆడియన్స్ అసలు ఏమి చూస్తున్నారు. వీడి గురించి వాళ్లకు ఎందుకు అర్థం అవ్వడం లేదు, అసలు వేడిని ఎలా సేవ్ చేస్తున్నారు అనేదే అర్థం కావడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:45 AM IST
    Bigg Boss 8 Telugu(64)

    Bigg Boss 8 Telugu(64)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ షో ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి అయ్యింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కానీ, బయట ఉన్న ఆడియన్స్ కి కానీ అర్థం కానీ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మణికంఠ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను మిగిలిన కంటెస్టెంట్స్ లాగా ఫిజికల్ గేమ్స్ ఆడలేదు, అలా అని ఎంటర్టైన్మెంట్ కూడా అందించలేదు, కానీ ఇన్ని రోజులు సేవ్ అవుతూ వస్తున్నాడు. అసలు ఇతనిలో ఏమి చూసి ఓట్లు వేస్తున్నారు రా బాబు అని చాలామందికి అంపించి ఉండొచ్చు. యష్మీ కి కూడా నిన్నటి ఎపిసోడ్ లో అదే అనిపించింది.

    నిఖిల్, పృథ్వీ తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యష్మీ నిఖిల్ తో మాట్లాడుతూ ‘ఆడియన్స్ అసలు ఏమి చూస్తున్నారు. వీడి గురించి వాళ్లకు ఎందుకు అర్థం అవ్వడం లేదు, అసలు వేడిని ఎలా సేవ్ చేస్తున్నారు అనేదే అర్థం కావడం లేదు. వాడు మొత్తం ఫేక్ సింపతీ గేమ్ ఆడుతున్నాడు, చాలా డేంజర్ వాడు. హౌస్ లో కొంతమంది సింపతీ యాంగిల్ లో ఎమోషనల్ అయిపోతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ వాడు అది కాదు, కేవలం కంటెంట్ కోసం వాడు ఏడుస్తాడు, ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేందుకు సింపతీ ఆడుతాడు తప్ప వాడు నిజంగా ఎమోషనల్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. వాడిని పాపం అనుకుంటే మనం అన్యాయం అవుతాము, హౌస్ లో ఉన్న అందరి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు వాడు’ అని తన మనసులోని మాటలు నిఖిల్ తో అంటుంది. నిఖిల్ కూడా వాడు ఫేక్ క్యాండిడేట్ అని చెప్పుకొస్తాడు. యష్మీ లో అందరికీ నచ్చేది ఇదే. ఈ విషయాన్ని మణికంఠ తో అప్పట్లో నామినేషన్స్ సమయం లో చెప్పింది, నిన్నటి నామినేషన్స్ లో కూడా ముఖం మీదనే ‘నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో నాకు కూడా అర్థం కావడం లేదు’ అని చెప్పేస్తుంది. మణికంఠ విషయం లో యష్మీ ఏదైతే అర్థం చేసుకుందో అది ముమ్మాటికీ నిజమే. హౌస్ లో ఈమె ఒక్కొక్కరిని చదివేస్తుంది అనే చెప్పాలి. ఈమెకి ఉన్నంత రీడింగ్ స్కిల్స్ హౌస్ లో ఎవరికీ ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

    మణికంఠ ని అతని తండ్రి దూరం పెట్టాడు అని అబద్దం చెప్పి నాటకాలు ఆడి సింపతీ సంపాదించాడు. కానీ మణికంఠ చెల్లి అతను కావాలని అబద్దం చెప్తున్నాడు అంటూ మీడియా ముందుకి వచ్చి చెప్పింది. అలాగే అతని పెళ్లి కూడా తండ్రి దగ్గరుండి చేయించాడు, కానీ నేను ఒంటరి వాడిని, నా పెళ్ళాం నన్ను దూరం పెట్టేసింది అని చెప్పుకొని డ్రామాలు వేసాడు. ఇవన్నీ ఆడియన్స్ గమనించడం లేదా?, గమనించి కూడా అతనికి ఎలా ఓట్లు వేస్తున్నారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న, చూడాలి మరి ఈ సింపతీ స్టార్ ని ఆడియన్స్ ఇంకెన్నాళ్లు సేవ్ చేస్తారు అనేది.