Pushpa 2: పుష్ప 2 సినిమా ముందున్న సవాళ్లు ఇవేనా..? వాటిని బీట్ చేస్తే ఈ మూవీ టాప్ 3 లో నిలుస్తుందా..?

ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెంచుతున్నాడు. ఇక కొత్తగా ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే పుష్ప 2 సినిమా తో ఆయన ముందు కొన్ని సవాళ్లు అయితే ఉన్నాయి.

Written By: Gopi, Updated On : April 13, 2024 4:28 pm

Are these the challenges ahead of Pushpa 2

Follow us on

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మాస్టారు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్..ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ను అందుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించిన ఈయన పుష్ప 2 తో మరొకసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెంచుతున్నాడు. ఇక కొత్తగా ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే పుష్ప 2 సినిమా తో ఆయన ముందు కొన్ని సవాళ్లు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాని బీట్ చేసి పుష్ప 2 తో 1300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలనే ఆశతో సినిమా యూనిట్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక త్రిబుల్ ఆర్ సినిమా కూడా దాదాపు 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక దాంతో 13 వందల కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తే ఈ సినిమా ఇండియా లోనే థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాగా కూడా పుష్ప 2 సినిమా నడుస్తుంది. ఇక మొదట రెండు వేల కోట్ల కలెక్షన్లతో బాహుబలి 2 ఉంది. అలాగే 1900 కోట్లతో దంగల్ సినిమా రెండో పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక 1300 నుంచి 1400 కోట్ల వరకు పుష్ప కలెక్షన్స్ ను వసూలు చేసినట్లయితే నెంబర్ 3 పొజిషన్ లో కొనసాగుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక దానివల్లే పుష్ప అనేది మామూలు హిట్ అయితే సరిపోదు.

సూపర్ డూపర్ సక్సెస్ అయితేనే ఇవన్నీ రికార్డులు బ్రేక్ అవుతాయి అని సుకుమార్ ఆలోచిస్తూ ఈ సినిమాలకి కావలసిన బుస్టాప్ ని అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక దానికోసమే ఈ సినిమాలో చాలావరకు హై ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ ను ఆడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది…