Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ని లవ్ స్టోరీస్, మాస్ మూవీస్ లో చూసి మురిసిపోయిన అభిమానులు, ఒక్కసారిగా ఇలా పీరియాడికల్ వారియర్ రోల్ లో చూసి ఎంతో సర్ప్రైజ్ కి గురయ్యారు. 2021 వ సంవత్సరం లో మొదలైన ఈ సినిమా, అనేక అడ్డంకులను ఎదురుకొని ఎట్టకేలకు ఇప్పుడు చివరి దశకి చేరుకుంది. మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నుండి డైరెక్టర్ క్రిష్ ఎందుకు మధ్యలో తప్పుకున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో రకరకాల చర్చలు నడిచాయి. షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో తన కెరీర్ పోతుంది అనే భయంతో డైరెక్టర్ క్రిష్ వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యాడని అందరూ అంటుంటారు. కానీ అసలు వాస్తవం అది కాదు.
సినిమా ఫస్ట్ మొత్తం పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ ఔట్పుట్ ని చూసి కాస్త అసంతృప్తి కి గురయ్యాడట. హీరోయిజం వేరే లెవెల్ లో పండాల్సిన చోట, క్రిష్ చాలా సింపుల్ గా లాగించేసాడని పవన్ కళ్యాణ్ కి అనిపించిందట. దీంతో ఆయన త్రివిక్రమ్ ఆద్వర్యం లో ఆ సన్నివేశాలకు హీరోయిజం జోడించి మళ్ళీ రీ షూట్ చేశారట. అంతే కాకుండా ఔరంగజేబు క్యారక్టర్ ని ముందుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో పలు సన్నివేశాలను చిత్రీకరించారట. కానీ అవి పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం నచ్చలేదు. ఆ సన్నివేశాలను మొత్తం మళ్ళీ బాబీ డియోల్ తో రీ షూట్ చేయించాడు. డైరెక్టర్ క్రిష్ సినిమాలన్నీ హీరోయిజం కి దూరంగా ఉంటూ, పొయిటిక్ గా ఉంటుంటాయి. అవి వేరే హీరోలకు వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ కి వర్కౌట్ అవ్వవు.
చాలా సన్నివేశాలు ఇలాగే రీ షూట్ చేయడంతో డైరెక్టర్ క్రిష్ హర్ట్ అయ్యి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. హీరోయిజం జోడించి రీ షూట్ చేసిన సన్నివేశాలన్నీ పవన్ కళ్యాణ్ కి ఆగస్టులో చూపించారట. ఈ వెర్షన్ ఆయనకీ అద్భుతంగా నచ్చడంతో వెంటనే మిగిలిన భాగాన్ని పూర్తిచేయడానికి డేట్స్ ఇచ్చాడట. ఇప్పుడు కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్రస్తుతం తనకి ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ పూర్తి అయ్యాక, వీలు చూసుకొని డేట్స్ ఇస్తానని చెప్పాడట. అంతే కాకుండా మనోజ్ పరమహంస వీడియో క్వాలిటీ పరంగా ఏ మాత్రం వెనుకాడడం లేదని తెలుస్తుంది. VFX మీద కూడా చాలా వరకు రీ వర్క్ చేయిస్తున్నారట. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టే విధంగా ఉండాలని నిర్మాత ఏఎం రత్నం కోరుకుంటున్నాడట. అందుకే మేకింగ్ విషయం లో ఆయన ఖర్చుకి అసలు వెనకాడడం లేదట.